Featured

Director Veera Shankar : మన తెలుగోళ్ళకి దేశం దాటి పోయినా కుల పిచ్చి మాత్రం వదలదు… చిత్రపురి కాలనీలో అసలు దొంగలు వీరే…: డైరెక్టర్ వీర శంకర్

Director Veera Shankar : తణుకులో పుట్టి పెరిగిన వీరశంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి కోడిరామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఇక ఆయన తెలుగులో తీసిన మొదటి సినిమా ‘హలో ఐ లవ్ యూ’. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ‘గుడుంబా శంకర్’ సినిమాను అంజన ప్రొడక్షన్స్ లో తీశారు. ఇక ఈసినిమా పరాజయం తరువాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘నమ్మ బసవ’ సినిమా తీశారు. ఇక కన్నడలో ఎలా ఆదరిస్తారు అనే విషయం మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లకు కుల పిచ్చి ఉంటుందంటూ తెలిపారు.

మనవాళ్ల కులపిచ్చి ఖండాలు దాటినా వదలరు…

కన్నడ ప్రజలు తెలుగు, తమిళ అంటూ బేధం చూపరని అందరినీ అందరిస్తారని ఎవరు ఏమిటి అని కూడా ఇతర రాష్ట్రాల వాళ్లను అడగరంటూ తెలిపారు. కర్ణాటకలో చదివే సమయంలో ఎవరూ నువ్వు ఏమిటి అని అడుగలేదు. కానీ భీమవరంలో చదవడానికి వచ్చినపుడు నీ కులమేమిటి అనే ప్రశ్న ఎక్కువగా ఎదురైంది అంటూ తెలిపారు. ఖండాలు దాటినా మన తెలుగువాళ్ళకు కులపిచ్చి మాత్రం పోలేదు అంటూ తెలిపారు.

చిత్రపురిలో దొంగలు వాళ్ళే…

సినిమా కార్మికుల కోసం ఇల్లు కట్టుకోడానికి స్థలాన్ని దానం చేసారు సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డిగారు. అయితే ఆయన సదుద్దేశంతో ఇస్తే ఇప్పడు అక్కడ మాత్రం ఆర్టిస్టులు సినిమా కార్మికులు కానివాళ్ళు స్థలాలను పొందుతున్నారనేది వాదన. ఈ విషయం పై డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున వీరశంకర్ గారు మాట్లాడారు. డైరెక్షన్ అసోసియేషన్ ను ప్రక్షాళన చేసి నకిలీ సినిమా కార్మికుల పేర్లను తొలగించడం జరిగింది, అలాగే ఇతర సంఘాలు కూడా ఆ పని చేస్తే బాగుంటుందంటూ చెప్పారు. చాలా మంది నిజమైన కార్మికులకు లబ్ది చేకూరడం లేదని నకిలీ వాళ్ళు స్థలాలను దక్కించుకుంటున్నారని దీనిపై ఎవరూ మాట్లాడరని చెప్పారు. దీనిపై మా అసోసియేషన్ ఫెడరేషన్ ఇంకా కార్మిక ఫెడరేషన్స్ కలిపి ఒక అథారిటీగా ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ అలా చేయరు. కార్మికుల విషయాల్లో మేమెందుకు కలగజేసుకోవాలని సినిమా పెద్దలు అనుకుంటున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago