మనం తెలిసి తెలియని వయసులో చేసే చిన్న చిన్న చిలిపి పనులు.. మధురమైన జ్ఞాపకాలుగా జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే, ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో యవ్వనం అనేది ఎంతో విలువైనది. అయితే సాధారణ అమ్మాయిల విషయంలోనే యవ్వనం అంత విలువైనది అయినప్పుడు… మరి అందగత్తెలు, మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇక యవ్వనం ఎంత ప్రాధాన్యతతో కూడుకుని ఉంటుంది.
అసలుకే అందాల భామలు.. నటన ఎలాగూ ఉంటుందయ్యే.. ఆ నటనలో భాగంగా హస్కీ ఎక్స్ ప్రెషన్స్, మత్తెక్కించే చూపులు ఇక కుర్రాళ్లను ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటాయి. ఒక్కో ముద్దుగుమ్మ వెనుకాల పదుల సంఖ్యలో కుర్రాళ్ళు తిరిగి తిరిగి తమ టీనేజీని అంతా హీరోయిన్ల యవ్వనం వైపే వృధా చేసుకుని ఉండి ఉంటారు.
స్టార్ హీరోయిన్ అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తన యవ్వనపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ తన్మయానికి లోననైంది.ఆ రోజుల్లో అంటూ తన ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి కట్ చేస్తూ సింపుల్ గా తన యవ్వనంలోని తొలిరోజుల గురించి చెప్పుకుని తెగ మురిసిపోయింది. మెయిన్ గా హైస్కూల్ రోజుల్లోని ప్రేమలు చాల సరదాగా ఉంటాయని, ఆ ప్రేమల్లో అమాయకత్వంతో పాటు తెలియని ఆశ కూడా ఉంటుందని.. ప్రతి ఒక్కరి జీవితంలో హైస్కూల్ ప్రేమ ఉంటుందని.. అలాగే తన జీవితంలో కొన్ని సరదా సంఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమా నిర్మాతగానూ మారడానికి రెడీ అవుతుంది. ‘ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్’ పేరుతో తన నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. ఇప్పటికే కొత్త కథలను కూడా విని రెండు కథలను ఫైనల్ చేసిందట. మొత్తానికి నిర్మాతగా కూడా అలియా తన భవిష్యత్తును బాగానే ప్లాన్ చేసుకుని ముందుకు పోతుంది..ఇక ప్రస్తుతం రాజమౌళి RRR లో రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ..హిందీలో కూడా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగూబాయ్ సినిమాలో లీడ్ రోల్ పోషించింది…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…