Featured

అక్కినేని అమల ఏ దేశానికి చెందిన మహిళనో తెలుసా ?

అక్కినేని అమల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. హలో గురూ.. ప్రేమ కోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం, అభినయం ఇప్పటికీ చాలామంది మెదళ్ళలో చెక్కుచెదరకుండా ఉందంటే అతిశయోక్తి కాదు. నాగార్జున ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు అమల. బ్లూ క్రాస్ అనే ఒక జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి తనకి మూగజీవాల పై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

1986వ సంవత్సరంలో సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన అక్కినేని అమల టి. రాజేందర్ దర్శకత్వం వహించిన మిథిలి ఎన్నై కాథలి సినిమాలో తొలిసారిగా నటించగా అది బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఒక్క రాత్రిలోనే అశేషమైన ఖ్యాతిని గెలుచుకున్న ఆమె సినీ ప్రేక్షకులను యాభై చిత్రాలతో విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇందులో అనేక తమిళ బ్లాక్ బాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఉల్లాడక్కం మలయాళ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆమె తన కాబోయే భర్త అక్కినేని నాగార్జునతో కలిసి నిర్ణయం, శివ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. కానీ అప్పటికే నాగార్జున వెంకటేష్ సోదరి అయిన దగ్గుబాటి లక్ష్మి ని వివాహం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే అమల పై ప్రేమ పెంచుకున్నారో ఆ క్షణమే ఆమెకు విడాకులు ఇచ్చేశారు. నాగార్జున ని పెళ్లి చేసుకున్న తర్వాత అమల హైదరాబాదు నగరానికి శాశ్వతంగా మకాం మార్చేశారు. వివాహానంతరం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనం లాంటి ఒకటి రెండు సినిమాల్లో నటించారు కానీ ఆ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అమల తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ కాగా… తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమల తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేవీ ఆఫీసర్ గా పనిచేసిన అతను ఆ తర్వాత డిప్యుటేషన్ మీద ఐఐటీ ఖరగ్పూర్ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి మెహ్యు హాస్పటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు. వివాహానంతరం అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ప్రదేశాల్లో చాలా కాలం వరకు జీవనం సాగించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago