బిగ్ బాస్ చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఎవరూ ఊహించని విధంగా 12వ వారం టాప్ 3 కంటెస్టెంట్ గా ఉంటారని భావించిన యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ప్రతి టాస్క్ లోను ఎంతో ఎనర్జిటిక్ గా ఎఫర్ట్ పెట్టే రవి ఎలా ఎలిమినేట్ అవుతారు మాకు ఓట్స్ చూపించాలి అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపోతే12 వ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రవి ఎంత మొత్తంలో సంపాదించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన రవికి బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఎంతో డిమాండ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన ఇతనికి నిర్వాహకులు వారానికి 7 నుంచి8 లక్షల రూపాయలను చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే రవి 12 వారాలకు గాను సుమారు 90 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు సమాచారం.అయితే బిగ్ బాస్ గెలిచిన వారికి ఇచ్చే ప్రైజ్ మనీ 50 లక్షలు కన్నా రవి ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక ఎలిమినేషన్ అయిన తర్వాత రవి బయటకు వచ్చి బిగ్ బాస్ ఫినాలే లో ఒక లేడీ కంటెస్టెంట్ ఉండాలని భావించినట్లు చెప్పకనే అసలు విషయాన్ని బయటపెట్టారు. ఏది ఏమైనా టాప్ 3 కంటెస్టెంట్ గా ఉండాలనుకున్నా రవి ఇలా బయటకి రావడంతో అభిమానులు మాత్రం ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…