Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో రాజమౌళి ఒకరు. కెరీర్ మొదట్లో ఈయన టీవీ సీరియల్స్ డైరెక్టర్ గా పని చేసేవారు. అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా దర్శకుడిగా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఇలా దర్శకుడిగా తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటపెట్టిన జక్కన్నలో ఒక నటుడు కూడా దాగి ఉన్నారని చాలామందికి తెలియదు. ఇటీవల కాలంలో రాజమౌళి పెద్ద ఎత్తున పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కొన్ని యాడ్ వీడియోలు చేస్తున్నారు. కానీ ఈయన బాల నటుడిగానే ఒక సినిమాలో కృష్ణుడి పాత్ర పోషించారని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.
ఈ విషయాన్ని తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ డాక్యుమెంటరీలో తెలియజేశారు.
మరి రాజమౌళి ఏ సినిమాలో కృష్ణుడి పాత్ర పోషించారు ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. ఆ సినిమా మరి ఏదో కాదు పిల్లనగ్రోవి. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ కలిసి ఈ సినిమాను ప్రారంభించారు. విజయేంద్ర ప్రసాద్ నిర్మాత కాగా.. శివశక్తి దత్తా డైరక్టర్.
పిల్లలగ్రోవి..
ఈ సినిమా ఓ సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో చిన్న పిల్లల చుట్టూ తిరుగుతూ పిల్లన గ్రోవి కథ సాగుతుంది. కథకు ప్రాణమైన బాలకృష్ణుడి పాత్రకు బొద్దుగా ఉండే రాజమౌళిని ఎంపిక చేశారు. షూటింగ్ ను కూడా కొంత వరకు పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలో బడ్జెట్ ఇష్యూ కారణంగా మధ్యలోనే నిలిపివేశారు. అలా మొదటిసారి రాజమౌళి మొహానికి రంగు వేసుకుని కెమెరా ముందుకు వచ్చారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…