Murari: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మహేష్ బాబు ఒకరు సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నాయి అలాంటి వాటిలో మురారి ఒకటి. ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
మహేష్ బాబు కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ చిత్రంగా మురారి సినిమా నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారా మహేష్ అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా సొంతం చేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పాలి. ఇటీవల ఈ సినిమాని తిరిగి విడుదల చేయగా మొదటి రోజే ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇలా మురారి సినిమాకి ఈ స్థాయిలో ఆదరణ లభించింది అంటే ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ అయిన తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమా కథను మరొక హీరో మిస్ చేసుకున్నారని ఆ ఛాన్స్ మహేష్ బాబు అందుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఎవరు అనే విషయానికి వస్తే…
సుమంత్…
కృష్ణ వంశీ నాగార్జున మధ్య నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి ఎంతో మంచి అనుబంధం ఉంది ఈ అనుబంధం తోనే మురారి సినిమా స్టోరీ లైన్ నాగార్జునకు కృష్ణవంశీ చెప్పడంతో కథ ఎంతో నచ్చిన నాగార్జున వెంటనే ఈ సినిమా కథ తన మేనల్లుడు సుశాంత్ యార్లగడ్డతో చేయమని చెప్పారట. ఈ సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని నాగార్జున చెప్పినప్పటికీ కృష్ణవంశీ నిర్మొహమాటంగా ఈ సినిమా చేస్తే మీతో చేస్తే లేకుంటే మహేష్ బాబుతో చేస్తా అని చెప్పేసారట. ఇలా చెప్పడంతో అప్పట్లో నాగార్జున కాస్త హర్ట్ అయ్యారని తెలుస్తోంది. అలా ఈ సినిమా సుమంత్ కాకుండా మహేష్ చేతికి వెళ్ళింది ఒకవేళ సుమంత్ తో చేసి ఉంటే ఆయన కెరియర్ మరోలా ఉండేదని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…