గత రెండు రోజుల నుంచి ట్రెండింగ్ లో ఉన్న పేరు హర్నాజ్ సందూ.. భారత దేశానికి దాదాపుగా 21 ఏళ్ల మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చిపెట్టింది ఈ సుందరి. ఇండియా నుంచి 21 ఏళ్ల హర్నాజ్ సందూ ఇటీవల ఇజ్రాయిల్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని దక్కించుకుని చరిత్ర లిఖించింది.
అయితే ప్రస్తుతం ఆమె ధరించిన కీరిటంపై అందరి దృష్టి పడింది. ఆమె ధరించిన అందాల కీరీటంలో ఎన్ని డైమండ్స్ ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో సహజంగానే నెలకొంటుంది. అయితే ఈ కిరీటంలో 1725 వైట్ డైమండ్స్ ఉన్నాయి. దీంతో పాటు మూడు బంగారు రంగు వజ్రాలను కూడా పొదిగారు.
‘మాడిఫైడ్ మిక్స్డ్ కట్ గోల్డెన్ క్యానరీ డైమండ్’ మిస్ యూనివర్స్ ధరించిన కీరీటం మధ్య భాగంలో ఉంటుంది. దాని బరువు అక్షరాల 62.83 క్యారెట్లు. ఈ వజ్రం స్త్రీలతో అంతరింగిక శక్తిని, ఐకమత్యాన్ని గుర్తు చేస్తుందంటుంది దీన్ని తయారు చేసిన మౌవాద్. చాలా ఏళ్ల తరువాత భారత్ కు మిస్ యూనివర్స్ రావడంతో హర్నాజ్ సందూకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.
గతంలో సుస్మితా సేన్, లారా దత్తాలు మిస్ యూనివర్స్ గా నిలిచారు. తాజాగా ఈ జాబితాలో హర్నాజ్ సందూ పేరు కూడా చేరింది. తన 17 ఏటనే మోడలింగ్ మొదలు పెట్టిన హర్నాజ్.. పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. గతంలో మిస్ యూనివర్స్ లు బాలీవుడ్ లో రాణించిన విధంగానే ఈ భామ కూడా బాలీవుడ్ లో కనిపిస్తుందో లేదో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…