‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఆహా ఓటీటీలో దుమ్మరేపుతున్న షో. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా భారీ ప్రచారం మధ్య ప్రారంభమైన ఈ షో సూపర్ గా సక్సెస్ అయింది. బాలయ్య ఎనర్జీ లెవల్స్ తో షో భారీ హిట్ అయింది. మరో వైపు ఇటీవల రీలీజ్ అయిన అఖండ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో బాలయ్య జోష్ మరింత కనిపిస్తోంది. షోలో వచ్చిన గెస్ట్ లతో అటాడుకుంటున్నారు బాలకృష్ణ. షో మొదటి ఎపిసోడ్ లోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా రావడం.. బాలయ్య, మోహన్ బాబుల మధ్య సంభాషణలు రసవత్తరంగా సాగడంతో.. ఎక్కువ మందికి అన్ స్టాపబుల్ రీచ్ అయింది.
మోహన్ బాబుతో బాలకృష్ణ చేసిన మొదటి షోను అభిమానులు పెద్ద ఎత్తున వీక్షించారు. రెండో ఎపిసోడ్ లో నానితో, మూడో ఎపిసోడ్ లో బ్రహ్మనందంతో బాలయ్య బాబు ఫన్ పంచారు. నాలుగో ఎపిసోడ్ కు అఖండ టీమ్ తో రచ్చ చేశారు బాలకృష్ణ. ఈ షోకు హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్, దర్శకుడు బోయపాటి , యాక్టర్ శ్రీకాంత్ తో సందడి చేశారు.
ఇక తాజాగా ఐదో ఎపిసోడ్ కోసం ట్రిపుల్ ఆర్ టీంను అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కోసం పిలుస్తున్నారు. ఐదో ఎపిసోడ్ లో దర్శక ధీరుడ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి అతిధులుగా వస్తున్నారు. ఈ సందడిని తెలియజేస్తూ… పోస్టర్లను కూడా విడుదల చేసింది ఆహా. ఈ పోస్టర్లలో బాలయ్య బాబు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. మరోవైపు జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్ల కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్, అలిమా భట్, అజయ్ దేవ్ గన్, దర్శకుడు రాజమౌళి చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ లో ప్రమోషన్లు చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే అన్ స్టాపబుల్ షోలో ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సినిమా విజయానికి అన్ స్టాపబుల్ కూడా తోడవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటి వరకు ముగిసిన నాలుగు ఎపిసోడ్లలో బాలయ్య రచ్చ చూసే ఉన్నాం.. ఇక ఐదో ఎపిసోడ్ లో బాలయ్య రచ్చ ఏవిధంగా ఉంటుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…