అధ్యక్ష పదవి చివరి రోజు ట్రంప్ ఎంతమందికి క్షమా భిక్ష పెట్టాడో తెలుసా?

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న రోజులలో ట్రంప్ వ్యవహరించిన తీరు అందరికి ఎంతో విసుగు తెప్పించింది. కానీ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోతుంది చివరి రోజులో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నేటితో ఆయన అధ్యక్ష పదవి ముగుస్తుండటంతో తన పదవి చివరి రోజున ఎంతో ఔదార్యం ప్రదర్శించారు. అధ్యక్ష పదవి నుంచి తొలగిపోతున్న సందర్భంగా ట్రంప్ ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టాడు. అయితే ట్రంప్ ఈ నిర్ణయాన్ని బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తీసుకున్నట్లు తెలియజేశారు. తన ప్రభుత్వం చివరి రోజుల్లో భాగంగా మొత్తం 140 మందికి క్షమాభిక్ష పెట్టారు.

ట్రంప్ క్షమాభిక్ష పొందినవారిలో ర్యాపర్ లిల్ వెయినీ, కొడాక్ బ్లాక్‌, డెట్రాయిట్ మేయర్ క్వామీ కిల్‌ప్యాట్రిక్‌లు ఉన్నారు.ఈ 73 మందికి క్షమా భిక్ష పెట్టిన పత్రాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. 73 మందికి క్షమాభిక్ష పెట్టడమే కాకుండా మరో 70 మందికి శిక్షను తగ్గించినట్లు ఈ సందర్భంగా వైట్ హౌస్ నుంచి అధికారకంగా తెలియజేశారు. మరికాసేపట్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసఫ్ బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.

2016 ఎన్నికల సమయంలో స్టీవ్ బ్యానన్‌ …ట్రంప్ వ్యూహకర్తగా వ్యవహరించేవాడు. అయితే మెక్సికో గోడ సరిహద్దు నిర్మాణం కోసం జరిగిన విరాళాల సేకరణలో స్టీవ్ బ్యానన్‌ అక్రమాలకు పాల్పడి దాదాపు మిలియన్ డాలర్లను నొక్కేసినట్టు రుజువు కావడంతో గత ఏడాది ఆగస్టులో ఆయన్ని అరెస్టు చేశారు. అంతేకాకుండా ర్యాపర్ వెయిన్‌, కొడాక్‌పై ఆయుధాల ఆరోపణలు ఉన్నాయి. అయితే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా క్షమాభిక్ష పెట్టడం సర్వసాధారణమైన విషయం అని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago