అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న రోజులలో ట్రంప్ వ్యవహరించిన తీరు అందరికి ఎంతో విసుగు తెప్పించింది. కానీ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోతుంది చివరి రోజులో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నేటితో ఆయన అధ్యక్ష పదవి ముగుస్తుండటంతో తన పదవి చివరి రోజున ఎంతో ఔదార్యం ప్రదర్శించారు. అధ్యక్ష పదవి నుంచి తొలగిపోతున్న సందర్భంగా ట్రంప్ ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టాడు. అయితే ట్రంప్ ఈ నిర్ణయాన్ని బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తీసుకున్నట్లు తెలియజేశారు. తన ప్రభుత్వం చివరి రోజుల్లో భాగంగా మొత్తం 140 మందికి క్షమాభిక్ష పెట్టారు.
ట్రంప్ క్షమాభిక్ష పొందినవారిలో ర్యాపర్ లిల్ వెయినీ, కొడాక్ బ్లాక్, డెట్రాయిట్ మేయర్ క్వామీ కిల్‌ప్యాట్రిక్‌లు ఉన్నారు.ఈ 73 మందికి క్షమా భిక్ష పెట్టిన పత్రాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. 73 మందికి క్షమాభిక్ష పెట్టడమే కాకుండా మరో 70 మందికి శిక్షను తగ్గించినట్లు ఈ సందర్భంగా వైట్ హౌస్ నుంచి అధికారకంగా తెలియజేశారు. మరికాసేపట్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసఫ్ బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
2016 ఎన్నికల సమయంలో స్టీవ్ బ్యానన్ …ట్రంప్ వ్యూహకర్తగా వ్యవహరించేవాడు. అయితే మెక్సికో గోడ సరిహద్దు నిర్మాణం కోసం జరిగిన విరాళాల సేకరణలో స్టీవ్ బ్యానన్ అక్రమాలకు పాల్పడి దాదాపు మిలియన్ డాలర్లను నొక్కేసినట్టు రుజువు కావడంతో గత ఏడాది ఆగస్టులో ఆయన్ని అరెస్టు చేశారు. అంతేకాకుండా ర్యాపర్ వెయిన్, కొడాక్‌పై ఆయుధాల ఆరోపణలు ఉన్నాయి. అయితే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా క్షమాభిక్ష పెట్టడం సర్వసాధారణమైన విషయం అని చెప్పవచ్చు.