కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరం మార్చి నెల 3వ వారం నుంచి దేశంలో పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తరువాత పాఠశాలలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. రోజులు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూ ఉండటంతో పాఠశాలలు తెరిచినా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపించే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. దేశంలోని చాలా విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారా బోధన జరుపుతున్నాయి.
కరోనా వైరస్ కు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ ద్వారా విద్యా బోధాన జరిగినా పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు అర్థం కావడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ పూర్తిగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో స్కూళ్లు మూసివేయడం వల్ల భారత్ కు భారీ నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. విద్యాసంస్థలు మూసివేయడం వల్ల ఏకంగా భారత్ కు 29 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కరోనా, లాక్ డౌన్ దేశ ఆర్థికవ్యవస్థపై మాత్రమే ప్రభావం చూపలేదని విద్యార్థుల్లో చదువుకోవాలనే ఆసక్తి తగ్గడానికి కూడా కారణమైందని వెల్లడించింది.
పపంచ బ్యాంకు దక్షిణాసియాలో విద్యాసంస్థల మూసివేత వల్ల 880 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ నుంచి “బీటెన్ ఆర్ బ్రోకెన్.. ఇన్ ఫర్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌతిండియా” అనే పేరుతో ఈ మేరకు నివేదిక విడుదలైంది. కరోనా, లాక్ డౌన్ విద్యార్థుల ఉత్పాదకతపై జీవితకాల ప్రభావం చూపుతుందని.. దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్ గా మిగిలిపోయే అవసరం ఉందని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా, లాక్ డౌన్ కోలుకోలేని దెబ్బ తీసిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
తూర్పు ముఖ ఇల్లు ఎందుకు ప్రత్యేకం? వాస్తు, ప్రకృతి చెప్పే విశేషాలు కొత్త ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా, అద్దెకు వెళ్లాలనుకున్నా…
సెలబ్రిటీలను దగ్గరగా చూడాలని, వారితో మాట్లాడాలని అభిమానుల్లో ఉండే ఆసక్తి కొత్తది కాదు. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి ఎవరు…
మైత్రీవనం లోని నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు…
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ముఖంపై మొటిమలు ఒకటి. ప్రత్యేకంగా యువతలో ఇది ఎక్కువగా…
భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. విదేశీ…
తెలుగు డిజిటల్ మీడియాలో సంచలనం రేపుతున్న ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ అలియాస్ “నా అన్వేషణ” మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ…