Featured

అఖండలో విలన్ గా నటించిన శ్రీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా ఇటీవలే డిసెంబర్ 2న విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే. విడుదల అయిన రెండు రోజులకే దాదాపుగా 40 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అఖండ హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు రోజులు అవుతున్నా కూడా టికెట్ల కొరత ఏర్పడుతోంది. ఆన్ లైన్ లో సైతం టికెట్లు దొరకడం లేదు. థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇక ఇందులో విలన్ క్యారెక్టర్ లో హీరో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శ్రీకాంత్ ఈ సినిమాతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో విలన్ క్యారెక్టర్ వరదరాజులు పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు శ్రీకాంత్. ఇకపోతే ఈ సినిమాకు గాను శ్రీకాంత్ ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా కోసం శ్రీకాంత్ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకున్నారని సమాచారం. ఈ సినిమాలో కొన్ని పలు సన్నివేశాల్లో నటించిన శ్రీకాంత్ ఊహించని స్థాయిలో పారితోషకం తీసుకోవడం గమనార్హం. దర్శకుడు బోయపాటి తన సినిమాలలో శ్రీకాంత్ కు మంచి మంచి పాత్రలు ఇస్తూ కెరిర్ కు బాగా హెల్ప్ అవుతున్నారు

శ్రీకాంత్ కూడా విలన్ జగపతి బాబులాగా సినిమాలలో బిజీ అవుతారని ఫ్యాన్స్ భావించినప్పటికీ, శ్రీకాంత్ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురవుతోంది. ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్న శ్రీకాంత్ తర్వాత ఇది ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి మరి. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ పలు సినిమాల్లో నటించినప్పటికీ, అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. శ్రీకాంత్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకు నిర్మాతలు భారీగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

3 minutes ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

12 minutes ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

25 minutes ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago