ఎవరు మీలో కోటీశ్వరులు.. ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న రియాల్టీ షో. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనిలో సామాన్యలతో పాటు.. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా గెస్ట్ గా వస్తున్నారు. ప్రస్తుతం ఈ షో ముగింపు దశకు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ షోను మరింత స్పెషల్ గా మార్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈ షోకు సంబంధించి అప్ డేట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి ఎంతో మంది సెలెబ్రిటీలు గెస్ట్ గా రాగా.. మొదటి ఎపిసోడ్ కు రామ్ చరణ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలిగెస్ట్ కూడా అతడే. ఆరోజు వాళ్లిద్దరు చేసిన సందడి మామూలుగా లేదు. వీరిద్దరి ఫ్యాన్స్ చూసి పండగ చేసుకున్నారు. అతడి తర్వాత సమంత, తమన్, దేవీ శ్రీ ప్రసాద్ లాంటి స్టార్స్ కూడా వచ్చారు.
కొరటాల శివ, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ షోలో కనిపించారు. ఇలా ఈ షో రేటింగ్ పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ షోకు మరో సూపర్ గెస్ట్ వచ్చాడు. ఆయనెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎన్టీఆర్ కు .. మహేశ్ బాబుకు మంచి స్నేహం ఉంది. ఆ సాద్న్నిహిత్యంతోనే అప్పట్లో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వచ్చాడు. ఈ షోకు వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్‌పై సెటైర్ల వర్షం కురిపించాడు మహేశ్ బాబు.
దీనికి సంబంధించి ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే మహేశ్ బాబు ఈ షోలో ఎంత వరకు గెలుచుకున్నాడనే విషయం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అతడు రూ.25 లక్షల వరకు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అంటే 13 ప్రశ్నల వరకు కరెక్ట్ గా సమాధానలు చెప్పారు. రూ.50 లక్షల రూపాయల ప్రశ్న అడుగుతున్న సమయంలో షో సమయం మించిపోవడంతో అక్కడితో ఆగిపోయినట్లు సమాచారం. పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…