కరోనా తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఎంతో మంది సెలెబ్రిటీలకు ఆ వ్యాధి మళ్లీ సోకుతుంది. ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అతడు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.
అతడి ఊపిరితిత్తులకు 75 శాతం ఇనెఫెక్షన్ సోకడంతో అతడి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని అతడి కుమారుడు అజయ్ కోరిన విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సినిమా తారలు స్పందిస్తున్నారు.
ఇప్పటికే సోనుసూద్ శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అంతే కాదు.. హీరో ధనుష్ కూడా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తాజాగా మాస్టర్ గురించి నటుడు మరియు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు.
శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. శివశంకర్ మాస్టర్ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తనతో తెలిపారని.. వాళ్లతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. మాస్టర్ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడాను అని విష్ణు ట్వీట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…