ప్రస్తుతం తెలుగులో రన్ అవుతోన్న బిగ్ బాస్ షోలో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. 9 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాల్టీలో షో తొమ్మిది మందిని బయటకు పంపించేశారు. ఎలిమినేట్ అయిన వారిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతవర్మ, ప్రియ, లోబో ఉన్నారు.
ఇటీవల కండల వీరుడు విశ్వా బయటకు వచ్చిన రావడంతో మొత్తం 9 మంది అయ్యారు. అయితే బయటకు వచ్చిన కంటెస్టెంట్లు వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది.
ప్రస్తుతం విశ్వా కూడా వారానికి ఎంత తీసుకుంటున్నాడో ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. వారానికి అతడు రెండు నుంచి రెండున్నర లక్షల వరకు పారితోషికం తీసుకున్నారట. దీంతో అతడు తొమ్మిది వారాలకు దాదాపు రూ.22 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సీజన్ 5 లో రెండు సార్లు కెప్టెన్ అయిన విశ్వా ఎలిమినేషన్ ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టాస్క్ ల విషయంతో 100 శాతం తన ఎఫర్ట్ పెట్టేసి విజయవంతంగా పూర్తి చేస్తాడు. అటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను బయటకు పంపించడంతో.. ఇక టాస్క్ లతో పని లేదు.. బయట ఫాలోయింగ్ ఉంటే సరిపోతుంది అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ లో ఇలా విశ్వాని ఎలిమినేట్ చేయడం అందరూ జీర్ణించుకోలేక పోతున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…