బిగ్ బాస్ షో ఇప్పటి వరకు 9 వారాలు పూర్తి చేసుకుంది. తొమ్మిదో వారంలో విశ్వా ఎలిమినేషన్ కావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడంతో హౌస్ మేట్స్ షాక్ లో ఉన్నారు. ఇక టాస్క్ లతో సంబంధం లేదు.. కేవలం బయట ఫాలోయింగ్ ఉంటే సరిపోతుంది అన్నట్లు సన్నీ మాట్లాడాడు.
హౌస్ లో బెస్ట్ సంచాలకుడిగా, బెస్ట్ కెప్టెన్ గా, బెస్ట్ ఆటగాడిగా , హౌస్ లో హీరోగా కూడా అతడు మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ బిగ్ బాస్ కు మాత్రం అవన్నీ ఏం పట్టనట్లు వ్యవహరించి విశ్వాను బయటకు పంపించేశాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు బిగ్ బాస్ షో పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక విశ్వా ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత హౌస్ లో ఉన్న వారి ర్యాంకులు ఇవ్వమని నాగార్జున చెబుతాడు.
అతడు అందులో మొదట ప్రియాంకకు 10 వ ర్యాంక్ ఇస్తాడు. ఆమె మొదట హౌస్ లో కనెక్ట్ అయిందని.. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించమని కోరతాడు. అంతే కాకుండా కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చాడు. ఇక 9 వ ర్యాంకును కాజల్ కు ఇచ్చేశాడు. 8వ స్థానంలో జెస్సీని ఉంచుతూ.. గివ్ అప్ ఇవ్వకూ అంటూ సలహా ఇస్తాడు. యానీ మాస్టార్ కు 7వ ర్యాంక్, మానస్ కు 6 వ ర్యాంక్ ఇస్తాడు.
ఇక టాప్ 5 కంటెస్టెంట్లలో 5 వ ర్యాంకును సిరీకి ఇస్తాడు. ఇక 4 వ ర్యాంకు ను సన్నీకి ఇస్తూ.. ఎవరేమి చెప్పినా వినకు.. నీ ఆట నువ్వు ఆడు అంటూ సూచనలు ఇస్తాడు విశ్వా. ఇక 3 వ స్థానంలో
షణ్ముఖ్ కు ఇస్తాడు. గెలిచినా ఒకే విధంగా ఉండు షణ్ముఖ్ అంటూ సలహా ఇస్తాడు. 2వ స్థానంలో రవికి, మొదటి స్థానం శ్రీరామ చంద్రకు ఇస్తూ భావోద్వేగానికి గురవుతాడు. శ్రీరామ చంద్రను చూస్తే..తన తమ్ముడిని చూసినట్లు ఉంటుందని కన్నీరుపెట్టుకుంటాడు విశ్వా. ఇలా టాప్ 5 కంటెస్టంట్లను బిగ్ బాస్ అతడితో పరోక్షంగా చెప్పించేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…