Samantha Web Series: మరో వెబ్ సిరీస్ కు సమంత సై.. మళ్లీ ఆ దర్శకులతోనే..!
Samantha Web Series: సమంత ఇంతకుముందు అమెజాన్ ప్రైమ్ లో పాపులర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ లో పనిచేసి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతోందట ఈ బ్యూటీ. అది కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులతోనే కావడం విశేషం. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించనున్నారు.
ఇందులో హీరోగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ను ఎంపిక చేసుకున్నారు. మొదటి సారి ఇతడు OTT ప్లాట్‌ఫారమ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వరుణ్ ధావన్ అమెజాన్ ప్రైమ్ లో రాబోయే వెబ్ సిరీస్‌పై సంతకం కూడా చేశాడట. ఆమె వరుణ్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక తాజాగా ఈ సిరీస్ లో చాలా యాక్షన్ సన్ని వేశాలు ఉన్నాయట. ఇందుకోసం వరుణ్, సమంతలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది యాక్షన్‌తో కూడిన సిరీస్ కాబట్టి నటీనటులు చాలా కష్టపడాల్సి ఉంటుందట. దీనికి సంబంధించి షూటింగ్ 2022లో ప్రారంభమవుతుంది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికా వెర్షన్‌లో నటిస్తోంది. ఇందులో ప్రియాంకతో పాటు రిచర్డ్ మాడన్ కూడా కనిపించనున్నారు. వరుణ్ విషయానికి వస్తే.. ‘జగ్ జగ్ జియో,’ ‘ఎక్కిస్,’ ‘రణభూమి,’ ‘అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్,’ మరియు ‘భేదియా’ వంటి చిత్రాలలో కనిపించబోతున్నాడు. మరోవైపు సమంత అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న నటించిన పుష్ప చిత్రంలో తీసిన ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తాజా వెబ్ సిరీస్ కు ఆమె ఒప్పుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…