తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి అందాల తార సావిత్రి తర్వాత అంతటి అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో వాణిశ్రీ ఒకరని చెప్పవచ్చు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె అప్పట్లో ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. చాలామంది శ్రీవాణి కొప్పు కట్టు బొట్టు గురించి మాట్లాడుకోవడం గమనార్హం.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోయిన్ గా కాకుండా పలు కామెడీ పాత్రల్లో నటించే వారు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఈమె పేరు శ్రీ కాకుండా రత్న కుమారి అనే పేరుతో నటించారు.’అలెగ్జాండర్’ సినిమాలో నటించడం కోసం వాణిశ్రీ ని మేకప్ వేసి తీసుకురమ్మని కాంతారావు, రాజనాల చెప్పగా ఆమెకు మేకప్ వేసి సెట్ కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆమెకు ఫోటోగ్రఫీ తీయగా చూడగానే కృష్ణస్వామి, నాగరాజారావు ఈ అమ్మాయి సినిమాలకు పనికిరాదని తేల్చి చెప్పారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే రణభేరి అనే సినిమాలో కాంతారావు సరసన హీరోయిన్ గా వాణిశ్రీని తీసుకోగా నిర్మాతలకి చెప్పి వాణిశ్రీకు వ్యాంప్ క్యారెక్టర్,రాజశ్రీని హీరోయిన్‌గా ఒప్పించారు కాంతారావు.అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత కాంతారావు మాట నిజం అయింది వాణిశ్రీ వ్యాంప్ క్యారెక్టర్ కు అద్భుతంగా సెట్ అయిందని పలువురు భావించారు. ఈ క్రమంలోనే ఎప్పుడు వ్యాంప్ క్యారెక్టర్ల అంటూ బాధ పడిన వాణిశ్రీ తో కాంతారావు త్వరలోనే మా ఇద్దరం కలిసి నటించే ఈ రోజు వస్తుందని చెప్పాడు. ఆ విధంగానే కాంతారావు వాణిశ్రీ జంటగా దేవుని గెలిచిన మానవుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో వాణిశ్రీ పేరు రత్నకుమారి కాగా ఆమె వాణిశ్రీ గా ఎలా మారింది అనే విషయానికి వస్తే ఎస్ వి రంగారావు రత్నకుమారిగా ఉన్నటువంటి తన పేరును వాణిశ్రీ గా మార్చారు. ఎస్ వి రంగారావు ప్రొడక్షన్ పేరు వాణిశ్రీ కావడంతో రత్నకుమారి పేరును తీసేసి తన ప్రొడక్షన్ పేరును వాణిశ్రీగా పెట్టారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెకు వాణిశ్రీ గా అందరికీ పరిచయం అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…