Featured

చలికాలంలో ఈ పండ్లను తింటే ఏమౌతుందో తెలుసా?

మన ప్రకృత లో లభించే పండ్లలో కొన్ని సీజనల్ పండ్లు ఉంటాయి. అలాంటి పండ్లు కేవలం ఆయా సీజన్లలో మాత్రమే దొరకడం వల్ల ప్రతి ఒక్కరు వాటిని తినడానికి ఇష్టపడతారు. కానీ అన్ని సీజన్లలో దొరికే పండ్లలో ఖర్జూరాలు ఒకటి అని చెప్పవచ్చు. ఖర్జూరాలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడి తింటుంటారు. ఖర్జూరం పండ్లలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయని చెప్పవచ్చు.పోషకాలు పుష్కలంగా లభించే ఈ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.

ఖర్జూర పండ్లు లో అధిక మొత్తంలో పోషకాలు ఉండటంతోపాటు, శరీరానికి అవసరమయ్యే సహజమైన గ్లూకోజ్ ను అందిస్తుంది.అంతేకాకుండా ఈ ఖర్జూరాలలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగు పరచడంతో పాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పవచ్చు. ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు అధిక మొత్తంలో ఈ పండ్ల నుంచి లభిస్తాయి.

పోషకాలు పుష్కలంగా లభించే ఈ పండ్లను చలికాలంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి వేడిని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా మనకు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఖర్జూరాలు ముందు వరుసలో ఉంటాయి.ప్రతిరోజు రెండు పండ్లను తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్త పోటును నియంత్రిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ పండ్లను తీసుకోవడం ద్వారా వారి శరీరానికి అవసరమైన క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభించడంతో శిశువు ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. మధుమేహ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంతో పాటు, రక్త ప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఇన్ని పోషకాలున్న ఖర్జూర పండ్లను ప్రతిరోజూ రెండు తీసుకోవడం ద్వారా ఎన్నో సమస్యలను దూరం పెట్టవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago