Mahesh Babu: మహేష్ బాబు అందం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా
Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హ్యాండ్సమ్ హీరో ఎవరు అంటే వెంటనే మహేష్ బాబు పేరు చెప్పేస్తారు అమ్మాయిలు. ఎందుకంటే ఆయన తన అందంతో ఎంతో మంది అమ్మాయిల మనసులు దోచుకున్నాడు. తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు.
నిజానికి మహేష్ బాబు ఇప్పటికీ పాతికేళ్ళ కుర్రాడు గా కనిపిస్తూ ఉంటాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలోని అందం కూడా పెరుగుతూ ఉంది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఆయన అందం వెనుక ఉన్న కారణం గురించి కూడా బయటపడింది. ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారీ వారి పాట సినిమాల్లో నటించాడు.
ఈ సినిమాలో ఆయన సరసన కీర్తి సురేష్ జంటగా నటించింది. ఇక ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా విడుదల కు దగ్గరగా ఉండటంతో సినీ బృందం ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నారు.
దాంతో మహేష్ బాబు, డైరెక్టర్ పరుశురాం తాజాగా సుమ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇందులో తమ సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు. ఇక సుమ మహేష్ బాబు అందం గురించి ప్రశ్నిస్తూ.. ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి ఎలా మెయింటెన్ చేస్తున్నారు అని అడిగాడు. దాంతో మహేష్ బాబు.. చాలావరకు అన్నీ తింటాను కానీ లిమిట్స్ లో తింటాను అని అన్నాడు.
ఇక పెరుగు, డైరీ ప్రొడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్డు లాంటివి అసలు తిననని అన్నాడు. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి వాళ్ల కోసం మాత్రమే తింటాను అని అన్నాడు. ఇక ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు కూడా తింటాను అని.. అలా ఒక 10 ఏళ్లకు పై నుంచి తింటున్నాను అని అన్నాడు. మొదట కష్టంగా ఉన్న ఇప్పుడు అలవాటు అయ్యింది అని అన్నాడు మహేష్ బాబు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…