Ananth Ambani: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ వారసుడిగా అనంత్ అంబానీ అందరికీ పరిచయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుపుతున్నాయి.
ఇక వీరి వివాహం నేడు జరుగుతుండగా వివాహ వేడుకలు గత 15 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదివరకే వీరు జాంనగర్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. తాజాగా జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి.
ఈ వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరై సందడి చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వీరి వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా ఈయన పెళ్లి వేడుకలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
5000 కోట్లు..
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాహాన్ని చేయడం కోసం ఎంతవరకు ఖర్చు జరిగిందనే విషయంపై ఒక వార్త సంచలనంగా మారింది అనంత్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు మాత్రమే సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలుస్తోంది. ఒక పెళ్లి వేడుకకు 5000 కోట్లు అంటే సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…