సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటేనే చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం.. ఆయన పేరు వింటేనే ఉప్పొంగిపోయే అభిమానులు ఆయన సొంతం. కేవలం తమిళనాడుకే కాకుండా.. దేశంలో, విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. తన మ్యానరిజం, స్టైల్స్ తో అభిమానులను సంపాదించుకున్నారు. బస్ కండాక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన ఎంతో మందికి స్పూర్తిదాయకం.. తాజాగా డిసెంబర్ 12 ఆయన 72 ఏట అడుగు పెట్టారు.
తలైవా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రజినీ కాంత్ ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు. ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయని సగటు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. భారత చలనచిత్ర పరిశ్రమల్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో రజినీ కాంత్ మొదటిస్థానంలో ఉన్నారు. కక్నాలెడ్జ్ 2021 నివేదిక ప్రకారం.. రజినీ నికర ఆస్తుల విలువ రూ. 360 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదంతా కేవలం సినిమా ద్వారానే సంపాదించింది. ఆయన ఎలాగూ యాడ్స్ లో నటించరనే విషయం తెలిసిందే.. ఒక వేళ యాడ్స్ లో నటిస్తే ఆయన ఆదాయం మరింతగా పెరిగి ఉండేది. సగటున ఒక్కో సినిమాకు రజినీ రూ. 60 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఈ నివేదిక ప్రకారం రజిని రూ. 100-120 కోట్ల పెట్టుబడిని కలిగి ఉన్నారు. సాధారణ స్థాయి నుంచి వచ్చిన రజినీ కాంత్ … శివాజీ రావ్ గైక్వాడ్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన వైనం అందరికి తెలిసిందే.
1950 డిసెంబర్ 12న కర్ణాటకలో ఓ సాధారణ మరాఠి ప్యామిలీలో రజినీకాంత్ జన్మించారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ ప్రోత్సాహంలో అంచెలంచెలుగా సూపర్ స్టార్ గా ఎదిగారు. తెలుగు, కన్నడ, హిందీ పరిశ్రమల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రజినీకాంత్ నటించిన అన్నాత్తే కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…