Featured

ద్విపాత్రాభినయ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?!

తన తండ్రి ఆనాటి స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించే పెద్ద నిర్మాత. ఆరాధన, ఆత్మబలం, దసరా బుల్లోడు చిత్రాల పేరు చెప్పగానే జగపతి ఆర్ట్ పిక్చర్స్ గుర్తుకొస్తుంది. సినీరంగంలో వి.బి.రాజేంద్రప్రసాద్ కు అక్కినేని నాగేశ్వరరావు పరిచయం ఉండడంతో ఆయన తోనే ఎక్కువ సినిమాలను రూపొందించారు.

వి.బి.రాజేంద్రప్రసాద్ సినిమాలను నిర్మిస్తూ కుటుంబానికి దూరంగా ఉండడం చూసిన తన భార్య.. కొడుకు కూడా సినిమాల్లోకి వెళ్ళకూడదని ఒట్టు వేయించుకుంది. అలా మద్రాసులోనే ఉన్నత విద్యను పూర్తి చేసిన తన కొడుకు ఎందుకో సినిమాల్లో నటించాలనుకున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అది కాస్త కో-డైరెక్టర్ ద్వారా నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ కు తెలిసిపోయింది. కొడుకు ఉత్సాహాన్ని కాదనలేక హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్నాడు.

ఆ క్రమంలో 1988లో బాలీవుడ్ లో వచ్చిన “ఖత్రోన్ కి కిలాడి” అనే విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అలా 1989 జగపతి ఆర్ట్ పిక్చర్స్, వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాణం, వి.మధుసూదనరావు దర్శకత్వంలో “సింహస్వప్నం” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో జగపతి బాబు, వాణివిశ్వనాథ్, శాంతిప్రియ, హీరో, హీరోయిన్లుగా నటించారు. కృష్ణంరాజు, జయసుధ మరో ప్రధాన పాత్రలో కనిపించారు. అలా మొదటి చిత్రంలోనే జగపతిబాబు హీరోగా ద్విపాత్రాభినయం పోషించారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందింది. ఆ తర్వాత వచ్చిన ‘అడవిలో అభిమన్యుడు’ లాంటి చిత్రాలు కూడా విజయాన్ని అందుకోలేక పోయాయి. సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో జగపతిబాబు గొంతు బాగోలేదని వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో ఆయనకు డబ్బింగ్ చెప్పించారు. ఆ తరువాత జగన్నాటకం, పెద్దరికం విజయాల అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గాయం’ చిత్రం జగపతిబాబు కి మాస్ హీరోగా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘శుభలగ్నం’ ‘మావి చిగురు’ లాంటి చిత్రాలు ఆయనను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి.

ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “అంతపురం” చిత్రంలో సారాయి వీర్రాజు అనే అతిధిపాత్రలో జగపతిబాబు నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి తిరిగి బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “లెజెండ్” చిత్రంలో ప్రతి కథానాయకుడి పాత్రలో కనిపించి జగపతిబాబు రెండో ఇన్నింగ్ ప్రారంభించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

9 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

9 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

11 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

11 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

11 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

12 hours ago