Categories: FeaturedMovie News

Mogulayya: భీమ్లా నాయక్ పాటలో పేర్లన్ని మార్చేశారు : కిన్నెర మొగులయ్య!

Mogulayya: నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మొగులయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తండ్రి తాతల నుంచి వారసత్వంగా వస్తున్న 12 మెట్ల కిన్నెర వాయిద్యం వాయిస్తూ జీవనం సాగిస్తున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే ఈయన గురించి తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయనకు తాను నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు.

ఈ క్రమంలోనే ఈయన భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. “ఆడా లేడు మియా సాబ్… ఈడా లేడు మియా సాబ్”అనే పాటను రామజోగయ్య శాస్త్రి మార్పులు చేసి ఈ పాట సహజత్వాన్ని కోల్పోకుండా ఆడా గాదు ఈడా గాదు.. అమీరోళ్ళ మేడా గాదు అని మొగలయ్యాతోనే పాడించారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మొదలయ్యే ఈ పాట గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు పి. ఏ వచ్చి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ సార్ కలవాలి అనుకుంటున్నారని చెప్పారు. ఇక ఆయనతో ఫోన్లో మాట్లాడగానే మరుసటిరోజు కలిసాను. ఇలా కలిసిన వెంటనే ఆయనతో మాట్లాడిన అనంతరం నా పాట పాడి వినిపించారు.


తల్లి తండ్రి పేరు మార్చమని చెప్పారు…


ఇలా ఈ పాటను వినిపించిన తర్వాత అంతా బాగుంది పేర్లను మాత్రమే మార్చాలి అని చెప్పారు. భీమ్లానాయక్ పాటలో తల్లి తండ్రి పేరు మార్చమని చెప్పారు. ఇందులో తల్లి పేరు మీరాబాయ్.. తండ్రి పేరు భీమ్లా నాయక్. అయితే నా పాటలో తల్లి పేరు ఆశాబీనీ తండ్రి పేరు బందేర్ సాబ్ ఉంది. ఈ రెండు పేర్లను మార్చమని చెప్పారు. అలా ఈ పాటను పాడే అవకాశాన్ని తనకు కల్పించారని మొగులయ్య ఒక ఇంటర్వ్యూలో ఈ పాట గురించి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago