టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “పిలిస్తే పలుకుతా” చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన షమితా శెట్టి నిజానికి తెలుగులో ఒకే ఒక్క చిత్రం నటించినప్పటికీ తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని “మనసా ఒట్టు.. మాటాడొద్దు” అనే పాట నేటికీ మ్యూజిక్ లవర్స్ మనసులలో ఫేవరెట్ సాంగ్ గా నిలిచిపోయింది.
షమితా శెట్టి 1979, ఫిబ్రవరి 2న సురేంద్ర, సునంద దంపతులకు ముంబైలోని చెంబుర్లో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన షమితా ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి అన్న సంగతి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కలిపి సుమారు 20కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ రొమాంటిక్ మూవీ “మొహబ్బతేన్” చిత్రంతో యువతరం గుండెల్లో గుబులు రేపిన ఈ అందాల తార ఇంత వరకూ పెళ్లెందుకు చేసుకోలేదో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అలాగని ఈ అందాల నటి సినిమాలపై కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శిల్పాశెట్టికి ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో బాడీ ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తోంది షమితా శెట్టి. అక్క తరహాలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన షమితా వరుసగా సినిమాలు చేస్తూ.. బిగ్ బాస్, జలక్ థికలా జా లాంటి టీవీ షోలలోనూ తళుక్కుమని మెరిసింది. ఇంటీరియర్ డిజైనర్‌గా యానిమల్ లవర్‌గా గుర్తింపు పొందిన షమితా… ఈమధ్య హెల్త్, ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అక్కడ శిల్పా శెట్టి చెబుతున్న ఫిట్ నెస్ ఫార్ములాల్ని ఫాలో అయిపోతూ… తన వయసు 40 దాటుతున్నా.. 30 ప్లస్ బ్యూటీలా కనిపిస్తూ… కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది. షమితా శెట్టి ప్రస్తుతం ముంబైలోని తన సొంత ఇంట్లోనే నివాసముంటుందని తెలిసింది. ఈ అందాల తార చేతిలో సినిమా అవకాశాలు లేకపోయినా ప్రముఖ ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ షోలలో పాల్గొంటూ ఫోటోలకు ఫోజులిస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాన్స్ ని అలరిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…