Doctor Harshavardhan : 32 ఏళ్లకే క్యాన్సర్ తో పోరాడి మరణించిన డాక్టర్ హర్ష వర్ధన్ తాను మరణించినా తన మరణాన్ని స్వీకరించిన విధానంతోనే అందరినీ కన్నీరు పెట్టిస్తున్నారు. క్యాన్సర్ తో పోరాడుతూ తాను బాధపడుతున్నా తన వారికి మనో ధైర్యాన్ని నింపి మరణించారు. తన అంత్యక్రియలకు తానే అందరినీ పిలిచి మరీ మరణించాడు. జీవితంలో మరణం అందరికీ వస్తుంది కానీ దాన్ని ఎలా స్వీకరిస్తున్నామన్నదానికి కొత్త భాష్యం చెప్పారు హర్ష వర్ధన్. బ్రతికినన్ని రోజులు తన వాళ్లతో మాట్లాడుతూ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని ఎంతోమందికి సహాయం చేస్తూ తనవల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడుతూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళి పోయిన హర్ష వర్ధన్ గారిని తలచుకుంటూ ఆయన స్నేహితులు ఎమోషనల్ అవుతున్నారు.
భార్య బాధ్యత తీసుకున్న హర్ష…
పెళ్ళై కొద్ది నెలలు కూడా అవ్వకనే హర్ష వర్ధన్ కు క్యాన్సర్ అని తెలిసింది. పెళ్ళైన నెలకే వీసా గడువు పూర్తవడంతో ఆస్ట్రేలియా వెళ్లిపోయిన హర్ష వర్ధన్ ఆ తరువాత కరోనా వల్ల ఇండియా రాలేక పోయాడు. తన భార్య సింధు ఆస్ట్రేలియా వెళ్లలేక పోయింది. ఇక ఇంతలోనే హర్ష కు క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో డాక్టర్ అవడం వల్ల తన పరిస్థితి ఏంటి అని తెలిసిన హర్ష తన భార్య కోసం ఆలోచించాడు.
ఆమెను విడాకులు తీసుకోవడానికి ఒప్పించాడు. ఆమెతో విడాకులు తీసుకున్నా స్నేహాతులుగా ఉందామని చెప్పి విడాకులు తీసుకుని విడిపోయాడు. అక్కడితో సింధుని వదిలేయక ఆమెకు విడాకుల తరువాత ఇవ్వాల్సినవి ఇచ్చి ఆమె పైచదువులు చదువుకోడానికి అమెరికాలో ఏర్పాట్లు చేసి ఆమెను చదివించాడు. అలా తాను మరణించే ముందు తన వారి కోసం అన్నీ చేసి ఎంతో మనోధైర్యంతో అందరికీ ధైర్యం నింపి శాశ్వతంగా దూరమయ్యాడు హర్ష వర్ధన్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…