Kakinada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామలగా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఇలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించారు.
నా భర్తని హత్య చేశారు…
ఆస్తి కోసం భర్తను తన అన్న కొడుకే చంపించాడంటూ కాకినాడ శ్యామల గారు తన భర్త హత్య గురించి వివరించారు. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు తనను తల మీద కొట్టారని వివరించారు. అయితే అంతా అయ్యాక తన మీద నేరారోపణ మోపారంటూ చెప్పుకొచ్చారు. తన భర్తను తానే హత్య చేయించినట్లు ఆరోపణలు చేయగా కోర్టులలో పోరాటం చేసి ఒంటరిగానే 18 ఏళ్ళు పోరాడాను, చివరికి హత్య చేసిన డ్రైవర్ కు శిక్ష పడింది అంటూ చెప్పారు.
తన భర్త పొలం కోసం తన అన్నకొడుకు బాబ్జి ఇలా ఇదంతా చేసాడు. ఆ డ్రైవర్ అతనికి సన్నిహితంగా ఉండేవాడు. ఆయన చనిపోయాక పొలం అమ్మాలనుకున్నపుడు కూడా అమ్మడానికి అడ్డుపడుతూ ఆస్తి తమదంటూ గొడవ పడ్డాడు. హై కోర్ట్ వరకు పోరాడి ఆస్తి కాపాడుకున్నాను. మా మావయ్య గారికి 600 ఎకరాలు ఉండగా అందులో మా ఆయన వాటా కింద 120 ఎకరాలు రాగా అందులో దాదాపు ఆయన క్లబ్ లో ఆడి జల్సా చేసే పోగొట్టాడు. మిగిలిన కొంచం భూమి కోసం మా ఆయననే హత్య చేసారు. చివరికి ఆ భూమిని అమ్మేసి హైదరాబాద్ వచ్చేసాను అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…