Categories: General News

ధోనీకి ఈ పాటంటే ఇంత ఇష్టమా..? రెహమాన్ చెప్పిన ఆసక్తికర విషయం

 

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఎంతో ఇష్టమైన పాట ఏంటో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వెల్లడించడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.

ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో రెహమాన్ తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన సంభాషణలో ఆయన ధోనీ గురించి కొన్ని ముచ్చట్లు పంచుకున్నారు.

సాధారణంగా తాను ధోనీని ఎయిర్‌పోర్ట్‌లలో లేదా ఇతర సందర్భాల్లో కలిసినప్పుడు చిన్నపాటి పలకరింపులకే పరిమితం అవుతుందని రెహమాన్ చెప్పారు. అయితే ఈసారి మాత్రం కొద్దిసేపు మాట్లాడుకునే అవకాశం దొరికిందని తెలిపారు. ఆ సంభాషణలో ధోనీ తనకు ఇష్టమైన పాట గురించి చెప్పడం ప్రత్యేకంగా అనిపించిందన్నారు.

తన స్వరపరిచిన మున్బే వా పాట అంటే ధోనీకి ఎంతో ఇష్టమని, అది తన ఫేవరెట్ సాంగ్‌లలో ఒకటని ధోనీ చెప్పినట్టు రెహమాన్ వివరించారు. 2006లో విడుదలైన సిల్లును ఒకరు కాదల్ చిత్రంలోని ఈ పాట అప్పటినుంచే సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ వస్తోంది.

ఈ సందర్భంగా సీఎస్కే నిర్వహించిన కార్యక్రమం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని రెహమాన్ పేర్కొన్నారు. ఇంత పెద్ద స్టేడియంలో సంగీత ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్పారు. అభిమానుల స్పందన తనను ఎంతో ఉత్సాహపరిచిందన్నారు.

ఇక సీఎస్కే జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయానని కూడా ఆయన వెల్లడించారు. విదేశాల్లో కూడా ఈ జట్టుపై ప్రజలకు ఉన్న గుర్తింపు తనను ఆకట్టుకుందని అన్నారు. క్రికెట్, సంగీతం రెండూ భాషా, ప్రాంతీయ సరిహద్దులను దాటి మనుషులను కలిపే శక్తి కలిగివున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Sairam K

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago