General News

వైరల్ వీడియో.. కారు పార్కింగ్ కు కుక్క సహాయం..?

కుక్కలకు మనుషులకు మధ్య ఎంతటి అవినాభావ సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుక్కలు తమ యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అందుకే చాలా మంది యజమానులు కుక్కలను తమ కుటుంబ సభ్యులగా భావిస్తారు. ఈ క్రమంలోనే కుక్కలు చేసే కొన్ని విచిత్రమైన పనులు చూస్తే ఎంతో ముద్దొస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘హ్యూమర్ అండ్ యానిమల్స్’ అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కుక్క పార్కింగ్ లో నిలబడి కారు పార్క్ చేయడం కోసం తన యజమానికి ఎంతో సహాయం చేస్తోంది. కారు బ్యాక్ చేస్తున్న సమయంలో కుక్క తన రెండు కాళ్ళను పైకెత్తి వెనక్కి రమ్మంటూ సూచనలు ఇస్తుంది. కారు పార్కింగ్ లైన్ మీదకి చేరుకోగానే ఇక ఆపండి అన్నట్టుగా తన కాళ్లని కిందకు దించి అరవడం మొదలు పెట్టింది. దీంతో కారు కూడా ఆగిపోయింది.

ఈ విధంగా కార్ పార్కింగ్ చేయడం కోసం తన యజమానికి కుక్క చేస్తున్న సహాయం చూసి పలువురు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విధంగా యజమానికి సహాయం చేసే కుక్కలు ఉంటే కారుకు బ్యాక్ కెమెరా అవసరం ఏమాత్రం ఉండదని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొంత సమయంలోనే వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో 2 మిలియన్ మందికి పైగా వ్యూస్ సాధించగా, 72 వేల మంది రిట్వీట్, 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం తను నెటిజన్లు బార్కింగ్ సెన్సార్ అని పిలుస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

1 day ago