ఇన్ని రోజులు మూడో కన్ను కేవలం శివుడికి మాత్రమే ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై సామాన్యులకు కూడా మూడో కన్ను రాబోతోంది. అదేంటి ప్రజలకు మూడో కన్ను ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫోన్లకు ఎంతో బానిస అయిపోయారు. సెల్ ఫోన్ చూస్తుంటే పక్కన ఏ ప్రళయం వచ్చినా పట్టించుకోము. కొన్నిసార్లు సెల్ ఫోన్ చూస్తు నడిచి వెళ్లడం వల్ల ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. అయితే ఇకపై ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా ఈ మూడవ కన్ను ద్వారా చెక్ పెట్టవచ్చునని కొరియాకు చెందిన ఇండ్రస్ట్రియల్ డిజైనర్ మిన్వూక్ పాంగ్ తెలిపారు.
డిజైనర్ మిన్వూక్ పాంగ్ రూపొందించిన ఈ పరికరాన్ని తలకు ధరించడం వల్ల మనం సెల్ ఫోన్ చూస్తన్న ఈ సమయంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనల్ని వెంటనే అప్రమత్తం చేస్తుంది. దీని ద్వారా వారు ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చని పాంగ్ తెలిపారు. ప్లాస్టిక్ తో తయారు చేసిన ఈ ‘థర్డ్ ఐ’ పరికరాన్ని నుదుటి మీద పెట్టుకోవాలి. ఈ పరికరం చూడటానికి అచ్చం కన్ను తరహాలోనే ఉంటుంది.
ఈ పరికరానికి రెప్ప కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది. మొబైల్ వాడే వారు తలదించుకుని మొబైల్ వాడుతున్న సమయంలో ఈ మూడవ కన్ను రెప్ప తెరుచుకుంటుంది. ఈ కన్నును ప్రత్యేకంగా స్పీకర్, గైరోస్కోపిక్ సెన్సార్, సోనార్ సెన్సార్‌లు ఉంటాయి. మొబైల్ చూస్తూ నడిచేప్పుడు ఈ సెన్సార్లు యాక్టీవ్ అవుతాయి. ఈ క్రమంలోనే మన చుట్టూ ఏదైనా ప్రమాదం సంభవిస్తుందనే క్రమంలో సెన్సార్లు యాక్టివ్ అయ్యి వెంటనే మనల్ని అప్రమత్తం చేస్తాయి. దీని ద్వారా మనం ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తం కావచ్చని పాంగ్ తెలిపారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…