Dorishetty Sathyamurthy : వికారాబాద్ జిల్లా తాండూర్ బిఎస్పి ప్రెసిడెంట్ దొరిశెట్టి సత్యమూర్తి చనిపోతా అంటూ పెట్టిన సెల్ఫీ వీడియో సంచలనం రేపింది. వారణాసిలో తన పిల్లలతో కలిసి సెల్ఫీ వీడియో ద్వారా చనిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక పోలీసులు వీడియో విడుదలైన 48 గంటలలో వారిని వెతికి పట్టుకున్నారు. ఇక అలా చనిపోవాలనుకోవాలని నిర్ణయం తీసుకోడానికి తన భార్య మిస్ అయి మూడు నెలలు అవుతున్నా పోలీసులా దర్యాప్తులో ఎలాంటి కదలిక లేకపోవడంతో వారే స్వయంగా వెతికినా ఏ మాత్రం ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో అలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సత్యమూర్తి.
నా భార్య గొడవ తరువాత ఇంట్లో నుండి వెళ్ళిపోయింది…
సత్యమూర్తి అతని భార్య అన్నపూర్ణది ప్రేమ వివాహం. కాలేజి రోజుల్లోనే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, వారికి ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి హైదరాబాద్ లో ఇంటర్ చదువుతోంది, రెండో అమ్మాయి ఇంటిదగ్గరే ఉండి స్కూల్ కి వెళ్తుంది. చిన్నచిన్న గొడవలతో అన్నపూర్ణ ఇంట్లోనుండి చనిపోతున్నట్లు లెటర్ రాసి వెళ్ళిపోయింది. కానీ మరణించి ఉండదని కేవలం ఎక్కడో ఉందని సత్యమూర్తి నమ్మకం. దాంతో భార్య అన్నపూర్ణ గురించి వెతకడానికి ఆయన దేశమంతా తిరిగారు. వెళ్లిన ప్రతి చోట పోలీస్ స్టేషన్స్ లో లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ మూడు నెలలు అయినా ఇంకా అన్నపూర్ణ జాడ ఏమాత్రం తెలియరాలేదు. దీంతో చనిపోవాలని తన పిల్లలతో కలిసి సెల్ఫీ వీడియో చేసారు సత్యమూర్తి.
ఇక అన్నపూర్ణ ఇంటి నుండి వెళ్ళినప్పుడు ఎలా వెళ్లిందనే విషయం మిస్టరి గా మారింది. ఎక్కడా సీసీ కెమెరాల్లో కనిపించకపోవడం, కొన్నిచోట్లా కెమెరాలు బ్లర్ అవ్వడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. తానే ఎక్కడికైనా వెళ్లిందా లేకపోతే ఎవరైనా ఏమార్చి తీసుకెళ్లారా ఇపుడు ఎక్కడుంది, ప్రాణాలతోనే ఉందా అనే విషయాలు ఇప్పటికీ ఇంకా మిస్టరి గానే ఉన్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…