Jr.NTR: అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న తారక్.. అండగా ఉంటానంటూ భరోసా?
Jr.NTR: అభిమానులకు ఏదైనా ఆపద వస్తే ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అభిమానులకు ఆపద సమయంలో ఆదుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ అభిమానికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో వెంటనే ఎన్టీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు.
ఎన్టీఆర్ అభిమాని జనార్ధన్ అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ విషయాన్ని ఎన్టీఆర్ వరుకు చేరడంతో ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభిమాని జనార్ధన్ కు ధైర్యం చెప్పడమే కాకుండా, తన తల్లితో తనకు ధైర్యం చెబుతూ తన కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇలా ఫోన్ కాల్ వీడియోని రికార్డ్ చేసి ఎన్టీఆర్ పీఆర్వోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది.
అభిమాని ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న వెంటనే ఎన్టీఆర్ స్పందించి కుటుంబానికి అండగా ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టి ఆ ఫోన్ నెంబర్ పై పడింది.ఈ క్రమంలోని ఎంతోమంది అభిమానులు ఆ ఫోన్ నెంబర్ ఎన్టీఆర్ దేనని భావించి పెద్ద ఎత్తున ఫోన్లు చేయడం మొదలుపెట్టారు.
ఇక ఎన్టీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ లో ఉన్న నెంబర్ తనది కాదని తన మేనేజర్ దని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకోనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…