Featured

DS Rao: మిస్టర్ నూకయ్య సినిమాలో శ్రీయ హీరోయిన్.. సగం షూటింగ్ అయ్యాక మనోజ్ వద్దన్నాడు : డి ఎస్ రావు

DS Rao : దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు తెలుగు ఇండస్ట్రీ లో నిర్మాత గా చమ్మక్ చల్లో, మిస్టర్ నూకయ్య, ద్రోణ వంటి సినిమాలను నిర్మించారు. సురేష్ ప్రోడస్షన్స్ వారితో మంచో అనుబంధం ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస రావు గారు ప్రస్తుతం సినిమాల నిర్మాణం తగ్గించి నటుడుగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణాల సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆర్థికంగా తాను దెబ్బతిన్న సందర్భాలను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. విదేశాల నుండి వచ్చి మరీ సినిమా మీద ఇష్టంతో ప్రొడ్యూసర్ అయ్యారు డిఎస్ రావు.

శ్రీయ తో సగం షూటింగ్ అయ్యాక మనోజ్ వద్దన్నాడు…

మిస్టర్ నూకయ్య సినిమా విషయంలో జరిగిన సంఘటనలు దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు చెప్పారు. మొదట శ్రీయాను హీరోయిన్ గా తీసుకుని కొంచెం షూటింగ్ పూర్తి అయ్యాక మనోజ్ హీరోయిన్ గా నాకు సెట్ అవ్వడం లేదు అంటూ మారుద్దామన్నాడు. ఇక దాంతో శ్రీయ ను తీసేసి వేరే వాళ్ళను తీసుకున్నాము. అయితే శ్రీయ తీసుకున్న అడ్వాన్స్ 10 లక్షలు లో 5 లక్షలు వెనక్కి ఇచ్చేసింది. వాళ్ళ అమ్మ మాట్లాడి నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నా చేస్తుంది అని చాలా గౌరవంగా మాట్లాడారు. ఇంకొకరైతే షూటింగ్ మధ్యలో తీసేస్తే డబ్బు వెనక్కి ఇవ్వడం పక్కన పెడితే చాలా కోప్పడుతారు కానీ తాను అలా చేయలేదు.

ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉంటారు అని డి ఎస్ రావు గారు చెప్పారు. ఇక ద్రోణ సినిమా సమయంలో డైరెక్టర్ దేశమంతా చూసి గోకర్ణ వద్ద సెట్ వేయాలని అనుకున్నాడు. ఇక డైరెక్టర్ చెప్పాడని నితిన్ కూడా అలానే అంటూ తలుపాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. అక్కడ నెల రోజుల ముందు వెళ్లి సెట్ వేయడానికి ప్లేసు చూస్తుంటే అక్కడ ఉన్న వ్యక్తి నెక్స్ట్ నెల ఇక్కడ వర్షాలు వస్తాయి అని చెప్పాడు. కానీ మేము వినలేదు సెట్ వేసాక వర్షాలు వచ్చాయి. మళ్ళీ వర్షాలు ముగిసాక అక్కడి వెళ్లి చూస్తే సెట్ అలానే ఉంది కలర్స్ పోయాయి అంతే మళ్ళీ రంగులు వేసి షూటింగ్ చేసాం. ఇక సినిమానే పోయాక ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాను.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago