తెలుగులో ప్రసారం అయిన అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్5 ముగిసింది. విన్నర్ గా సన్నీ, రన్నర్ గా షణ్ముక్ నిలిచారు. మొదటి నుంచి అనుకున్నట్లే సన్నీ విన్నర్ గా నిలిచాడు. ఇక విన్నర్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఆమె తల్లి కళావతి కళ్లల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఎంతో సంతోషంతో.. ఆనందంతో .. భావోద్వేగాల నడుము ఫైనల్ ముగిసింది. ఇక ఈ ఫినాలే లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉన్న సిరిని మొదట ఇంటి నుంచి బయటకు వచ్చింది. తర్వాత టాప్ 4 కంటెస్టెంట్ మానస్ బయటకు వచ్చాడు. ఇక ఫినాలేలో మిగిలింది ముగ్గురు. దీనిలో ఒక కంటెస్టెంట్ ను ఇంటి నుంచి బయటకు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లాడు నాగ చైతన్య.
సీజన్ 4 లో సోహెల్ డబ్బుకు ఆశపడి.. హౌజ్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఇదే విధంగా హౌస్ లో కూడా వారి ముగ్గురిలో ఒకరిని టెంప్ట్ చేసేందుకు సూట్ కేస్ తీసుకొచ్చాడు నాగచైతన్య. కానీ ఎవరూ ఆ సూట్ కేస్ ను తీసుకోలేదు. తర్వాత బయట నుంచి నాగార్జున శ్రీరామచంద్ర ఎలిమినేట్ అని ప్రకటిస్తాడు. అతడిని తీసుకొని నాగ చైతన్య వేదికపై తీసుకొస్తాడు.
ఆ సూట్ కేసులో రూ.20 లక్షలు ఉన్నట్లు వెల్లడించాడు నాగచైతన్య. శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. తెలుగు అభిమానులకు.. ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఈ షోలో అడుగుపెట్టానని చెప్పాడు. ఇప్పుడు ఆ కల నెరవేరిందని చెప్పాడు. రేపటి నుంచి నాలో మరో శ్రీరామ్ చంద్రను చూస్తారని నాగార్జునకు చెబుతాడు శ్రీరామ్.
ఇక వెళ్లిపోయే ముందు నానీ సినిమాలోని ‘పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మా’ అంటూ పాట పాడాడు. ఈ పాట పాడుతున్నంత సేపు శ్రీరామ్ తల్లితో పాటు.. ఎక్స్ హౌస్ మేట్ హమీదా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక చివరకు వాళ్ల అమ్మకు హగ్ ఇచ్చేసి.. హమీదాకు కూడా హగ్ ఇచ్చి.. చివరకు హమీదా పక్కన కూర్చుంటాడు శ్రీరామ చంద్ర.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…