కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. డబ్బుల కోసం ఎవరైనా ఎంతటి పని చేయడానికైనా సిద్దంగా ఉంటారు. అది వారి కుటుంబపోషణ కొరకు మంచిదే. అయితే ఏ పని చేసినా అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి. చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తే మాత్రం అది ముమ్మాటికి తప్పే. అలాంటిదే కొంత మంది డబ్బులకు ఆశ పడి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారు.
చట్ట విరోధ పనులు చేసి బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారు. ఇంతకు ఈ నయా దొంగలు ప్రకృతికి విరుద్దంగా చేస్తున్న పని ఏంటంటే.. రైతన్న పొలంలో వానపాములు ఉంటే సాగు బంగారు లాంటి దిగుబడి వస్తుంది అంటారు. అలాంటి వానపాములను ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు వీళ్లు. ఆధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పులికాట్ సరస్సు అనేది తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు కూడా ఆనుకొని ఉంటుంది. పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ చేపలు, వివిధ రకాల పక్షులకు ఆవాసం ఉండటమే కాకుండా ఇక్కడ వానపాములు సైతం అధికంగా ఉంటాయి.
పులికాట్ సరస్సులో తవ్వేకొద్దీ వానపాములు బయటకు వస్తుంటాయి. ఇదే అదునుగా భావించారు కొందరు దుండగులు. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఆక్వా కల్చర్ అనేది ఉంటుంది. అందులో రొయ్యలను పెంచుతుంటారు. వాటి ఉత్పత్తి అధికంగా ఉండాలంటే వానపాములను వాటికి ఆహారంగా ఉపయోగిస్తారు. వాటిని కొనుగోలు చేయాలంటే కిలో వానపాములు దాదాపు రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఇలా కాకుండా పులికాట్ సరస్సుకు దగ్గర్లో నివసిస్తున్న పేదలకు డబ్బు ఆశచూపి కిలో వానపాములకు రూ.1500 ఇస్తామంటూ వారిని మభ్య పెడుతూ వానపాముల సేకరణే వారి పనిగా చూపించారు.
దీంతో ప్రతీ రోజు తవ్వకాలను జరుపుతూ ఇలా పర్యావరణానికి హానీ చేకూరుస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల అండతోనే ఇలాంటివి జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై సూళూరుపేట ఇంచార్జ్ డీఎఫ్ఓ పవన్ కుమార్ మాట్లాడుతూ.. స్మగ్లింగ్ కు ప్రోత్సహిస్తున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని.. ఎంతటి వారినైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…