లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో ఇరుక్కుపోయి.. తమ రాష్ట్రాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ లు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. అటువంటి వారు ఈ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలంగాణ పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పాస్ వెబ్సైట్ (https://tsp.koopid.ai/epass) లోకి వెళ్లి ఈ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అప్లై చేసేముందు తగినంత సమాచారం ఎంటర్ చేసి అప్లై చేయాలని పోలీసులు చెబుతున్నారు. అలా వచ్చిన దరఖాస్తులు తాము పరిశీలించి అంతా సక్రమంగా ఉంటే.. ఈ పాస్ లు జారీ చేస్తామని తెలంగాణ డిజిపి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాస్ చాలా కీలకంగా మారింది. ఈ పాస్ లేకుండా సరిహద్దులు దాటే అవకాశాలు లేవు. మార్గ మధ్యలో గాని, చెక్ పోస్టుల్లో గాని పోలీసులు అడ్డుకుంటే ఈ పాస్ చూపిస్తే సరిపోతుంది. ఈ కారణంతో ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అందువల్ల ఈ వెబ్సైటు కు ట్రాఫిక్ ఎక్కువ రావడంతో ప్రస్తుతం స్ట్రక్ అయింది అని, ఇప్పటికే అప్లై చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కొంత బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి మళ్ళీ అప్లై చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…