Telangana: రేపటి నుంచి టిఎస్ఆర్టిసి లో మహిళలకు ఉచిత ప్రయాణం…ఫ్రీ కదా అని ఎక్కారో 500 ఫైన్?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేశారు. ముఖ్యమంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించి అనంతరం మొదటి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

క్యాబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడారని ఈయన తెలియజేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకు మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అయితే ఈ ఉచిత ప్రయాణాన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 9వ తేదీ కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక బస్సులోకి ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా తమ ఆధార్ కార్డు కండక్టర్ కి చూపించాల్సిన అవసరం ఉంటుందని కండక్టర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత టికెట్ ఆ మహిళకు ఇస్తారు.

టికెట్ లేకపోతే జరిమానా…

ఈ టికెట్ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడి వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా కాకుండా ఉచితం కదా అని ఫ్రీగా ఎక్కి కూర్చుంటే మధ్యలో చెకింగ్ వచ్చినప్పుడు వారి దగ్గర ఆ టికెట్ లేకపోతే 500 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందని అందుకే తప్పనిసరిగా ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని వెళ్లి కండక్టర్ కి ఆధార్ నెంబర్ చెప్పి టికెట్ తీసుకోవడం కంపల్సరీ అని తెలుస్తుంది. టికెట్ తీసుకోకపోయినా లేదా తీసుకున్న టికెట్ మధ్యలో పడేసిన చెకింగ్ అధికారులు వచ్చినప్పుడు టికెట్ లేకపోతే ఫైన్ చెల్లించాల్సిందేనని తెలుస్తుంది.