బుల్లితెరపై ఈటీవీలో ప్రదీప్ శుక్రవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్లు చేసే స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రోజురోజుకు ఈ కార్యక్రమం అత్యంత రేటింగ్స్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈ నెల 30వ తేదీన ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా రాకింగ్ రాకేష్ ఎంటర్ అవుతూ మధ్యతరగతి టీమ్ లీడర్ నని జడ్జిలు నవ్వకుండా వెళ్లి పోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అని అనడంతో.. మీ స్కిట్టు చూసి మేమెంత బాధపడుతున్నమో తెలుసా అంటూ రోజా రివర్స్ పంచ్ వేసి అందరిని నవ్వించారు. ఆ తరువాత బుల్లెట్ భాస్కర్ మరోసారి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బుల్లెట్ భాస్కర్ భార్యగా షూటింగ్ సెట్ కి వచ్చిన ఫహీమా తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది.
ఈ క్రమంలోనే వర్ష డైరెక్టర్ గారు వాట్ గోయింగ్ ఆన్ హియర్ అని అడగడంతో..ఫహీమా వర్షను షట్ అప్ అంటుంది. ఈ క్రమంలోనే వర్ష బుల్లెట్ భాస్కర్ ని ఏదో అడగబోతుండగా ఫహీమా వర్ష పై గట్టిగా అరుస్తూ బెదిరించారు. ఇలా సెట్ లో వర్షను బెదిరించడంతో రోజా ఒక్కసారిగా షాక్ అయ్యి ఎంతో నవ్వుకున్నారు.
ఈ విధంగా ఈ ప్రోమోలో బాడీగార్డ్ అవతారంలో టీమ్ లీడర్ కార్తీక్ నరేష్ చేసిన స్కిట్ అందరిచేత నవ్వులు కురిపించింది. ఇకపోతే చివరిగా గెటప్ శీను స్కిట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…