Categories: FeaturedMovie News

లెజెండరీ కమిడియన్ రాజాబాబు అప్పట్లోనే ఎన్ని ఆస్తులు సంపాదించారో తెలుసా?

హాస్య నటుడు రాజబాబు… తెలుగు సినిమాలు చూసేవారి ప్రతిఒక్కరికి ఈయన గురించి తెలిసే ఉంటుంది. అది ఎందుకు అంటారా …? ఈయన తన 20 సంవత్సరాల నట జీవితంలో 560 సినిమాలలో నటించారు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. రాజబాబు అక్టోబరు 20, 1935 తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టారు. నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. తాను అప్పట్లోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆ తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం ఆయన పనిచేశాడు. ఇక ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనే వాడు. ఇక దీనితో ఆయన వారి స్నేహితుల ప్రోత్సహంతో చెన్నైకి వెళ్లి అక్కడ సినిమాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

రాజబాబు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములును వివాహమాడాడు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు (దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు. ఆ తర్వాత మద్రాసు చేరుకొని పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొద్దీ రోజుల తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ తరువాత వరుసగా తండ్రులు-కొడుకులు, కులగోత్రాలు , స్వర్ణగౌరి , మంచి మనిషి మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను మొట్టమొదటిగా 350 రూపాయలు పారితోషికంగా స్వీకరించాడు.

ఇకపోతే సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప మనసు ఉన్నగలవాడు ఆయన. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించే వాడు. ఇక ఈయన వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు.అంతేకాదు ఆయన జీవితంలో మొత్తం 9 ఫిలింమ్ ఫేర్ అవార్డులు, 3 నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు అందుకున్నారు. అయితే అప్పట్లోనే రాజాబాబు బాగా సంపాదించారట. అప్పట్లో హీరోలతో సమానంగా రాజాబాబు రెమ్యునరేషన్ అందుకునే వారట. ఆ కాలంలోనే అయన కోట్ల ఆస్తులు సంపాదించారట. ఆ తర్వాత అయన సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారట.

ఇక అన్ని సాగుతున్న సమయంలో ఆయన స్వతహాగా బాబు అండ్ బాబు పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అందులో మొదటి సినిమాగా “ఎవరికీ వారే యమునా తీరే” చేసారు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక అయితే ఆ తర్వాత “మనిషి రోడ్డున పడ్డాడు” అనే సినిమా చేసారు. ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

రాజబాబు 1983 సంవత్సరం ఫిబ్రవరి 14న 48 ఏళ్ల వయసులో మరణించారు. అయితే రాజబాబుకి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజబాబు ఆస్తుల వివరాల గురించి మాట్లాడుతూ.. రాజబాబు చాలా దురదృష్టవంతుడు అన్నాడు. అప్పట్లోనే డబ్బు సంపాదించి అన్ని కోట్లు కూడబెట్టినా కూడా అయన మాత్రం అనుభవించకుండా వెళ్లిపోయాడని బాధ పడ్డాడు. ఆ రోజుల్లోనే రాజాబాబు ఫారెన్ కార్లలో తిరిగే వాడని, అప్పట్లో తమిళ నటుడు శివాజీ గణేషన్ నుంచి లక్ష రూపాయలకు ఆ ఫారెన్ కారు కొన్నాడన్నారు. అయితే వీరికి ఇండియాతో పాటు అమెరికాలోకూడా ఆస్తులున్నాయని చెప్పాడు. అంతేకాకుండా అమెరికాలో రాజబాబు పిల్లల్లిద్దరూ సొంత సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నారని.. ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ విలువే సుమారు 30 కోట్ల వరకు ఉంటుందన్నాడు. వాటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయని చిట్టి బాబు వెల్లడించాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago