Categories: FeaturedMovie News

జయప్రద రాజమండ్రిలో ఉన్న తన ఇంటిని ఎందుకు కూల్చేసారో తెలుసా ?

జయప్రద… అందం, అనుకువు, ధైర్యం కలగాలిపి ఉన్న వ్యక్తి ఆవిడ. ఇక ఈవిడ అసలు పేరు లలితారాణి. జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. జయప్రదకు చిన్నపుడు డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవ సంవత్సరం నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారి ద్వారా మాత్రం లభించలేదు. తన 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకర రెడ్డి ఆమె డాన్స్ ను చూసి అవకాశాన్ని కలిగించారు.

ఇలా ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976 లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇక అంతే అప్పటి నుండి ఆవిడ ఎక్కడ వెన్నకి తిరగకుండా అనేక సినిమాలను చేసింది. ఈవిడ తన నట ప్రస్థానంలో ఏకంగా 300 సినిమాలలో నటించింది అంటే నమ్మండి. ఇక ఆమె చదువు విషయానికి వస్తే పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివినది. కొన్ని సినిమాలు చేసిన ఆమె ఆ తరువాత బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కొడుకు, సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను ఈమె 1986 జూన్ 22 న వివాహమాడినది.

ఇంత వరకు బాగానే ఉన్న ఆమె పుట్టి పెరిగిన రాజమండ్రిలో ఉండే తన సొంతం ఇంటిని ఆమె స్వయంగా కూలగొట్టారు. దానికి కారణం అక్కడ ఏదో కమర్సియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం ఆ స్థలంలోని ఆవిడ ఇంటిని పడగొట్టారు. ఆమె పెరిగిన ఆనవాళ్లను చిన్న నాటి గురుతులు అలా కామెరిసిల్ కాంప్లెక్స్ కోసం పడగొట్టడం తో ఆమె అభిమానులు రాజమండ్రి వాసులు ఒకింత డీలా పడ్డారు. కానీ ఏదైనా ఆమె సొంత విషయం కాబట్టి ఎవరు అడ్డు పడలేదు. ఇక ఆమె జీవించినా ఆ ఇంటికి జయప్రద అసలు పేరు అయిన లలిత అనే పేరు పెట్టారట వాళ్ళ అమ్మ గారు. ఏది ఏమైనా లలిత నివాసం ఇక లేదు.

ఇక ఇప్పటికి ఆవిడ ఎంత ఎత్తుకు ఎదిగిన తన సొంత ఊరు అయినా రాజమండ్రి తో మాత్రం తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఈవిడకి ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. వారు కూడా సినిమాలలో నటించిన విజయం అందుకోలేక కనుమరుగు అయిపోయారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago