Categories: FeaturedMovie News

పసివాడి ప్రాణం సినిమాలో ఒకప్పటి విలన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో ఎందరో నటులు, మహానటులు ఉన్నారు. హీరోలుగా చాలామంది మంచి గుర్తింపును లభించుకొన్నప్పటికీ వారికి సమానంగా నటించి విలనిజంలో కొత్త అర్థాన్ని చూపించిన కొంతమంది విలన్స్ చూస్తేనే భయం వేస్తుంది మనకు. అంత క్రూరత్వాన్ని వెండితెరపై చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, పసివాడి ప్రాణం సినిమా విలన్ గా నటించిన బాబు అంటోనీ. ఈయన చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, ఇతను నటించిన పసివాడి ప్రాణం సినిమాలో విలన్ అని చెప్పగానే అబ్బో ఈ విలన్ అని వెంటనే గుర్తుపడతారు తెలుగు వాళ్ళు.

ఇక హీరోలతో సమానంగా ఫైట్ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటోనీ అతని సినిమాలలో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కేవలం యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా ఈయన జేబుదొంగ, శత్రువు, మిత్రుడు, నిప్పురవ్వ, లారీ డ్రైవర్, ఏకలవ్యుడు, కాంచన వంటి సినిమాలలో విలన్ గా నటించి ప్రేక్షకుల ఆదరణను పొందాడు. ఇంకా తినేత్రుడు, పసివాడి ప్రాణం సినిమాలో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మెగాస్టార్ చిరుతో పోటాపోటీగా ఫైట్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆయన.

బాబు అంటోనీ వ్యక్తిగత విషయానికి వస్తే… తను సినిమాల్లో మాత్రమే కాదు తన నిజజీవితంలో కూడా మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీ ఈయన. ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి ఆదరణ తెచ్చుకున్నాడు బాబు అంటోనీ. అప్పటిలో మంచి స్టార్ డం హీరోగా ఎదిగాడు. ఇక ఇతను పూణేలో ఇంగ్లీష్ లిటిరేచర్ గా డిగ్రీ పూర్తి చేశాడు. మొదటిగా విలన్ పాత్రలు శిరంబు అనే సినిమాతో బాబు ఆంటోనీ మళియాల సినిమారంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటిలో అగ్ర హీరోలు కూడా ఇతరులతో ఫైట్లు చేయాలంటే చాలా కష్టపడేవారు. ఆంటోనీ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. దాదాపు 160 సినిమాలలో ఈయన నటించారు.

సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే ఒక రష్యన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విలన్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయే విలన్ గత కొన్ని రోజులుగా మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కనబడలేదు. కానీ తమిళ్, మలయాళం సినిమాలో మాత్రం నటిస్తూ ఉన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాలో నటించాడు. అంతేకాదు త్వరలో మణిరత్నం తీయబోతున్న పోన్నియిన్ సెల్వన్ చిత్రంలో కూడా నటించబోతున్నాడు. ఇక ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఉన్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago