కొంతమంది ఇళ్లల్లో బొద్దింకలు చాలా చిరాకును తెప్పిస్తాయి. వాటి కోసం మార్కెట్‌లో దొరికే స్ప్రేల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. వాటిని వాడినా మళ్లీ అవి వస్తుంటాయి. ఇలా చాలామంది బొద్దింకలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ స్ప్రేల ద్వారా కొన్ని అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇవన్నీ కాకుండా కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల వాటి బారి నుంచి తప్పించుకోవచ్చనేది వైద్యులు చెబుతున్నారు. ఎలా అంటే.. బిర్యాని ఆకుల ద్వారా వాటి బెడద నుంచి తప్పించుకోవచ్చు. వాటిని వంటగదిలోని ఓ మూలకు పెడితే.. ఆ వాసనకు దగ్గరకు కూడా రావు. బిర్యాని ఆకులు లేకపోతే మనకు పల్లెటూర్లలో ఎక్కువగా లభించే వేప ఆకులను కూడా ఉంచొచ్చు.
కొన్ని సమయాల్లో వేప నూనె కూడా వాడొచ్చు. ఇలా ప్రతీ మూలకు వాటిని మార్చుతూ ఉంటే బొద్దింకలు అస్సలు రేనే రావు. ఇంకా వాటి బారి నుంచి తప్పించుకోవాలంటే మరో చిట్కా కూడా ఉంది. లవంగాలు కూడా బొద్దింకలను ప్రాలదోలడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వీటి నుంచి వచ్చే వాసన కూడా వాటిని దగ్గరకు రానివ్వకుండా చేస్తాయి. ఇవే కాకుండా ఇంట్లో బోరిక్ పౌడర్ ఉంటే దానికి కొద్దిగా చక్కెరను కలిపి… ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు తిరుగుతున్నాయని అనుకుంటామో అక్కడ ఓ మూలకు పెట్టాలి. అలా బొద్దింకలు రాకుండా చేసుకోవచ్చు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా అవి వస్తూనే ఉంటాయి. పైన చెప్పిన విధంగా ఇలా కొన్ని చిట్కాలను వాడితే ఎంతో ఉపయోగం ఉంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…