బిగ్ బాస్ సీజన్ 5 లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. పవర్ రూం యాక్సెస్‌ని పొందుకున్న నలుగురు ఇంటి సభ్యులు మానస్, విశ్వ, హమీదా, సిరిలు కెప్టెన్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ నలుగురుకి సైకిలింగ్ టాస్క్ ఇచ్చి.. ఇంటి సభ్యుల మధ్య పెంటపెట్టారు బిగ్ బాస్. గ్రూప్‌లుగా విడిపోయి కొట్టుకోవడానికి రెడీ అయ్యారు. యాంకర్ రవి కోసుకుంటా అని అంటుంటే.. సరయు ఏడుస్తూ కనిపించింది. నేటి ఎపిసోడ్ లో జరగున్న వాటికి సంబంధించి ఓ ప్రోమో ను రిలీజ్ చేశారు.
ఇందులో కప్టెన్సీ టాస్క్ గురించే ఎక్కువగా చూపించారు. దానిలో హౌస్ మేట్స్ గ్రూపులుగా విడిపోయినట్లు తెలుస్తోంది. తమకు నచ్చిన హౌస్‌మేట్ కెప్టెన్‌గా ఎంపికయ్యేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. ఈ సందర్భంగా కాజల్, సరయు మధ్య వాగ్వాదం నెలకొన్నట్లు ప్రోమోలో చూపించారు. అలాగే.. యాంకర్ రవి, సన్నీ మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతున్నట్లు చూపించారు.
అయితే, ప్రోమోకు.. ఒరిజినల్ ఎపిసోడ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు ఏం జరిగిందనేది 5వ ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే తెలుస్తోంది. తజాగా ఈ ప్రోమో తెగ వైరల్ గా మారింది. సరయు ఏడుపులు.. కాజల్ అరుపులు.. మధ్యలో రవి, సన్నీ వాగ్వాదం వెరసి నేటి ఎపిసోడ్ రసవత్తరంగా ఉండనుంది. ఇదిలా ఉండగా.. కెప్టెన్ గా పోటీ చేసేవారిలో ముగ్గురు వ్యక్తులు అందరికీ తెలిసిందే వాళ్లు.. ఎవరికీ పనిష్ మెంట్ ఇవ్వాలో బిగ్ బాస్ చెప్పి ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.
అయితే చివరిలో కెప్టెన్ గా పోటీ చేసేందుకు అర్హులుగా ఉన్న హమీదాకు బిగ్ టాస్క్ ఇచ్చాడు. ఆమె ఎంపిక చేసే హౌస్‌మేట్ మరెప్పుడు.. కెప్టెన్ కాలేరనేది టాస్క్. ఈ నేపథ్యంలో ఆమె ఎవరిని ఎంపిక చేసుకుందనేది సస్పెన్స్. దానికి కూడా ఈ రోజే తెర పడనుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…