కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం శాస్త్రవేత్తలు, వైద్యాధికారులు నిరంతరం కృషి చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేపడుతున్నారు. ఎంతో ప్రమాదకరమైన కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటే.. సోషల్ మీడియా మాత్రం ప్రతి ఒక్క అడ్డమైన వీడియోలను షేర్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.ఈ విధమైనటువంటి వీడియోలు చూసినా నెటిజన్లు వాటిని అనుసరిస్తూ మరింత ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
తాజాగా వాట్సాప్ లో “ఊపిరి టెస్ట్” అంటూఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ద్వారా మీకు కరోనా ఉందో లేదో ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు. ఇందుకు కేవలం ఊపిరి గట్టిగా బిగబడితే చాలు అంటూ ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇరవై ఒక్క నిడివిగల ఈ వీడియోలో మొత్తం నాలుగు పాయింట్లు ఉంటాయి. ముందుగా గట్టిగా శ్వాస తీసుకోవాలి. 2 పాయింట్ A నుంచి B వరకు గట్టిగా ఊపిరి బిగ పట్టాలి. తరువాత శ్వాసను వదలాలి. A నుంచి B వరకు ఊపిరి బిగపట్టుకొని ఉంటే మీకు కరోనా లేదు అని అర్థం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేస్తూ తమకు కరోనా లేదంటూ వారికి వారే నిర్ధారించుకున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఫహీమ్ యునస్ ట్విట్టర్ ద్వారా స్పందించి దీనిలో ఏ మాత్రం నిజం లేదని, ఇలాంటి వాటిని నమ్మి ఎవరు ప్రయత్నించవద్దని తెలిపారు. ఈ వీడియోని చూసి ఊపిరితీసుకోకుండా ఉంటూ మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోకండి అని డాక్టర్ ఫహీమ్ తెలిపారు. ఇలాంటి వార్తలు కరోనా కంటే ఎంతో ప్రమాదకరమని ఆయన మరోసారి హెచ్చరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…