Categories: FeaturedGeneral News

Falaknuma palace history : హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎందుకు కట్టారు… కట్టించిన వ్యక్తి అప్పులపాలయ్యాడా.??

Falaknuma palace History : ఫలక్ నుమా ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో చార్మినార్ కు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉండే ప్యాలెస్. తేలు ఆకారంలో నిర్మించబడిన ఇటలీయాన్, టుడూర్ ఆర్చిటెక్చర్ తో నిర్మితమైంది. ఉర్దూలోని ఫలక్ నుమా అనగా తెలుగులో ఆకాశ ధర్పణం. ఈ ప్యాలస్ తేలు ఆకృతిలో ఉంటూ 60 గదులు, 22 విశాలమైన హాళ్లు ఉండి ఇక డైనింగ్ హాల్లో ఒకేసారి 100 మంది భోజనం చేసే వీలు ఉంది. ఇక డైనింగ్ భవనంలో గోడలు బంగారు వర్ణంలో మెరిసిపోతు ఆకర్షస్థాయి. ఫలక్ నుమా ప్యాలెస్ “పైగా”వంశస్థుల కట్టడం. మన దేశంలో ముస్లిం రాజుల పరిపాలన సమయంలో ఎన్నో కట్టాడాలు నిర్మితమవగా నిజాం ప్రభువుల కాలంలో హైదరాబాద్ లో నిర్మితమైన ఫలక్ నుమా ప్యాలెస్ అత్యంత సుందరమైన కట్టాడాల్లో ఒకటిగా నేటికీ ఉంది. దీని నిర్మాణానికి అప్పట్లో 40 లక్షలు ఖర్చు కాగా దీన్ని నిర్మాణం వల్ల కట్టించిన వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ప్యాలెస్ లోని ఒక దర్పణం ఖరీదు సుమారు 35 కోట్లు. ఇక ఇలాంటి విశేషలు ఉన్న ఫలక్ నుమా ప్యాలెస్ అసలు ఎవరు నిర్మించారు ఎందుకు అనే విషయాలు తెలుసుకుందాం..

పైగా వంశస్థుల నుండి నిజాం వారి చేతుల్లోకి ప్యాలెస్…

ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాణం మార్చ్ 3 1884 లో కట్టించడానికి శంకు స్థాపన చేసారు. ఇక ఈ భవనం అన్ని హంగులతో పూర్తవడానికి దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది. ఇక ఫలక్ నుమా ప్యాలెస్ ను హైదరాబాద్ ప్రధానమంత్రి ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. ఈ భవనంను మూడు వందల ఎకరాల్లో నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రధాన భాగం 93,971 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఇటలీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన పాలరాళ్లతో పరిచారు.

ఇక భవనంలో రంగురంగుల అద్దాల పట్టకాలను కిటికీ నిర్మాణంలో ఉపయోగించడం వల్ల గదులు మరింత ఆకర్షిణీయంగా కనిపిస్తాయి. ఫలక్ నుమా ప్యాలెస్ లో నివాసం ఉండటానికి సర్ వికారుల ఉమ్రా కట్టించుకున్నారు. కానీ ఈ భవనం నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవడం వల్ల ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇక భార్య సలహా మేరకు ప్యాలెస్ కు నిజాం ప్రభువు మహబూబ్ ఆలీ పాషా ను ఆహ్వానించగా ఆయన ప్యాలెస్ అందానికి ఫిదా ఆయ్యారట. ఇక నిజాం ప్రభువు ప్యాలెస్ నిర్మాణం వల్ల వికారుల్ ఉమ్రా ఆర్థిక ఇబ్బందులను ఎదురకొంటున్నారని తెలిసీ ఆర్థిక సహాయం చేసారు. వికారుల్ కు భవన నిర్మాణానికి అయిన అప్పులను తీర్చడానికి చాలా కాలం పట్టిందట. ఇక 1895 లో నిర్మాణం ఖర్చులు చెల్లించి నిజాం ప్రధాన మంత్రి మహబూబ్ ఆలీ పాషా కొనుగోలు చేసారు. అలా పైగా వంశస్థుల చేతి నుండి నిజాం వంశస్థుల చేతిలోకి భవనం వెళ్ళిపోయింది. ఇక 2000 సంవత్సరం వరకు సాధారణ ప్రజలకు అనుమతి లేని ఫలక్ నుమా ప్యాలెస్ తాజ్ గ్రూప్ అద్దెకు తెసుకుని 2010 నుండి ఆధునీకరించి అన్ని వసతులను కల్పించి హోటల్ గా ప్రారంభించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago