Anupama Parameswaran : తెలుగులో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వర్. అ ఆ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే జీవితం, శతమానం భవతి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక ఇటీవలే బృందావనం లో కృష్ణుడు వచ్చాడే అంటూ మరొకసారి కుర్రకారు గుండెల్లో అలజడి రేపింది. ఇక యాంకర్ల దగ్గర నుండి సినిమా హీరోయిన్ల వరకు కొద్ది గా పేరు రాగానే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, చీరాల షాపుల ఓపెనింగ్ అంటూ హడావిడి చేస్తుంటారు.
సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం…అసహనానికి లోనైనా అనుపమ…
ఇక అనుపమ కూడా ఒక షాప్ ఓపెనింగ్ కోసం కోదాడ వెళ్ళింది. అక్కడ అనుపమ ను చూడటానికి జనం ఎగబడ్డారు.స్థానికులు, అభిమానులు తమ మొబైల్ కెమెరాల ద్వారా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు సైతం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆమె మరింత సమయం అక్కడే ఉండాలని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో కొందరు అకతాయిలు ఆమె ప్రయాణించే కారు టైర్లలో గాలితీశారు. దీంతో అనుపమ పరమేశ్వరన్ అసహనానికి గురయ్యింది. అనంతరం షాపు నిర్వాహకులు ఆమెకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారు. ఇక ఈ ఇష్యూ ఇపుడు నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానం ఉండొచ్చు కానీ మరీ పిచ్చి ఉండకూడదని చాలా మంది నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…