Featured

Actor Banuchander : రాజమౌళి మట్టిని పేపర్లో చుట్టి చాక్లెట్ అని అమ్మగలడు….. : భానుచందర్

Actor Banuchander praises Rajamouli : రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహాద్రి సినిమా గురించి ఎవరు మర్చిపోలేరు. సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటుడు భానుచందర్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయం లో తాజాగా భానుచందర్ రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

రాజమౌళి మట్టిని పేపర్లో చుట్టి చాక్లెట్ అని అమ్మగలడు…..

దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేస్తున్న తరుణంలో నటుడు భానుచందర్ రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న భానుచందర్ రాజమౌళి గురించి ఇలా చెప్పుకొచ్చాడు… సింహాద్రి సినిమా డబ్బింగ్ సమయంలోనే సినిమా తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను కానీ మీరు నాతో మాట్లాడారు మీరు చాలా బిజీ అవుతారు. దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతారని 12 ఏళ్ళ క్రితమే రాజమౌళి తో నేను చెప్పాను. ప్రస్తుతం అదే జరిగింది అని అన్నారు. ఒక మట్టి ముద్దను చాక్లెట్ లాగా పేపర్లో చుట్టి అమ్మగల సామర్థ్యమున్న వ్యక్తి అని రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాకుండా ఎవరు పడితే వారు ఈ పనిని చేయలేరు అని కూడా కితాబు ఇచ్చారు.

ఒక సినిమాను అద్భుతంగా దర్శకత్వం వహించడం వరకే కాకుండా ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా దాని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చుకోవాలి అన్న విషయం రాజమౌళికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు అని చెప్పారు. ఇలాంటివి రాజమౌళి దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు అని చెప్పారు. కానీ ఇలాంటి ప్రయత్నించినా కొంత మందికి సాధ్యపడక పోవచ్చు అని కూడా చెప్పాడు. బాహుబలి సినిమా గురించి ఉదాహరణగా తీసుకుంటే బాహుబలి 1 విజయం తర్వాత కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే బాహుబలి 2 సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. అంతేకాకుండా బాహుబలి1 మించిన విజయాన్ని బాహుబలి2 తో పొందారు. ఇలాంటివి అందరికీ సాధ్యపడదని ఇలాంటి ప్రత్యేక నైపుణ్యం రాజమౌళి కి మాత్రమే సొంతం అని ఆయన పేర్కొన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమావాస్య ప్రభావమా?.. స్కూల్ రీఓపెన్ రోజున క్లాస్‌లో ఒక్క విద్యార్థినే!

వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…

15 minutes ago

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

31 minutes ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

39 minutes ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

53 minutes ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago