Featured

కేర్ ఆస్పత్రిలో బాలయ్య… ఆందోళనలో అభిమానులు..?

నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇలా బాలకృష్ణ ఉన్నఫలంగా కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి ఏం జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణకి చిన్న సర్జరీ జరిగిందని వైద్యులు వెల్లడించారు.

బాలకృష్ణకు కుడిభుజం తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన కేర్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైద్యులు ఆయన కుడి భుజానికి చిన్న సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆయన సర్జరీ సక్సెస్ అయిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలియజేశారు.

ప్రస్తుతం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని త్వరలోనే ఆయనని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఏదిఏమైనా ఈ మధ్యకాలంలో హీరోలు వరుసగా ఆసుపత్రి పాలవడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. మొన్నటికి మొన్న చిరంజీవి మణికట్టుకు సర్జరీ చేయగా నేడు బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేశారు. ఇలా వరుసగా హీరోలందరూ ఆసుపత్రి పాలవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

గత రెండు రోజుల క్రితం కన్నడ పునీత్ మరణ వార్తను తెలుసుకున్న బాలయ్య బెంగుళూరుకి వెళ్లి ఆయనను చూసిన బాలకృష్ణ ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.ఈలోగా బాలకృష్ణ ఆస్పత్రి పాలవడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

1 hour ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago