కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వాహనదారులు జనవరి 1, 2021 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. టోల్ వసూళ్లను ఎలక్ట్రానిక్ విధానంలో వసూలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో కేంద్రం పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం పాత వాహనాలైనా, కొత్త వాహనాలైనా మిహాయింపులు ఉండవని కేంద్రం చెబుతోంది. దేశంలోని అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ విడుదలైంది.
టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ ను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనలను అమలు చేస్తోంది. గతేడాది అక్టోబర్ నెల నుంచి ఫాస్టాగ్ అమలును కేంద్రం తప్పనిసరి చేస్తోంది. అయితే ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసినా ద్విచక్ర వాహనాలకు, మూడు చక్రాల వాహనాలకు, 2017 డిసెంబర్ 1 కంటే ముందు కొనుగోలు చేసిన పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపును ఇచ్చింది.
అయితే ఈ నిబంధనలలో మార్పులు చేసి నాలుగు చక్రాల వాహనాలన్నింటికీ వచ్చే సంవత్సరం నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. దీంతో పాటు మరికొన్ని కొత్త రూల్స్ ను సైతం కేంద్రం అమలులోకి తెచ్చింది. 2021 సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి థర్డ్ పార్టీ బీమా కావాలన్నా ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్రం చెబుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…