గతేడాది కరోనా వైరస్ దేశంలో వ్యాపించడంతో అధికారులు ముందుగా అప్రమత్తమై లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది కూలీలు ఉపాధి లేక తమ సొంత ఊర్లకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే రోడ్డుపై వాహనాలు తిరగకపోవడంతో వలస కూలీలు ఏకంగా కాలిబాటన తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే బీహార్ కి చెందిన బాలిక జ్యోతి పేరు విస్తృతంగా మారుమోగిపోయింది.
దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్ పాశ్వాన్ కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్‌లో ఆటో నడిపే వాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. అయితే గతేడాది లాగిన్ విధించడానికి ముందుగా రోడ్డు ప్రమాదంలో మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే తన తండ్రి బాగోగులు చూసుకోవడం కోసం తన పెద్ద కూతురు జ్యోతి గురుగ్రామ్ చేరుకుంది. మార్చి నెలలో కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో జ్యోతి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తినడానికి తిండి లేక వారు ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేక ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.
ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో ఎలాగైనా తన సొంత ఊరికి వెళ్లాలని భావించింది. కానీ ఎలాంటి వాహనాలు అందుబాటులో లేకపోవడం, తన తండ్రి ఎటూ కదలలేని పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని జ్యోతి తన దగ్గరున్న కొంత డబ్బును ఖర్చు చేసి ఒక పాత సైకిల్ కొని ఏకంగా 12 వందల కిలోమీటర్లు, ఏడు రోజులపాటు తన తండ్రి సైకిల్ పై కూర్చోపెట్టుకొని సొంత గ్రామానికి చేరిన జ్యోతి గురించి అప్పట్లో పలు మీడియా సంస్థలు “సైకిల్ గర్ల్” పేరుతో కథనం రాయడంతో దేశం మొత్తం జ్యోతి పేరు మారుమోగిపోయింది.
ఈ విధంగా తండ్రి కోసం ఎంతో తపన పడి సైకిల్ గర్ల్ గా గుర్తింపును సంపాదించుకున్న జ్యోతి తండ్రి మోహన్ సోమవారం గుండెపోటు రావడంతో మరణించారు. మోహన్ మృతి పట్ల దర్భాంగ జిల్లా అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి తన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…